sk101-19
10/11/2015
* శీర్షిక: సింధూ నాగరికత *
నాడే సాక్షాత్కారం నాగరిక జీవనం
కుమ్మరి చక్రంతో కమనీయమైన కుండలు
కాల్చిన ఇటుకలతో శతాబ్దాలు నిలిచిన కట్టడాలు
ప్రణాలిక బద్దమై సిద్దమైన భవనాలు
రమ్యమైన రహదారులు
లంబకోణ కూడళ్ళు
మురుగు నీటి పారు దలకు ముచ్చటైన వ్యవస్ధలు
ఇటుక రాయి తాటించిన ఇంపుగ రాణించిన
బావులు చెరువులు
స్మశానానికైనా తీరైన నిర్వహణ
అరక దున్నే ఎద్దు ఒండ్రు భూములు దున్నగా
పసిడి పంట పొలాలు బారులు తీరగా
అటునిటు పచ్చతివాచీతో గంగమ్మకు స్వాగతం పలుకగా
యమునమ్మ కరుణతో
తృణధాన్యాలు, చిరుధాన్యాలు,
బీన్స్ బార్లీ, అవిసె ఆవాలు
ఆశతీరగ పండించి మిగులు దిగుబడి సాధించి
ధాన్యాగారాలు నింపినారు పట్టణాలకు పంపినారు
పల్లెజీవనమీవిధము అలరార
పట్టణాల ప్రగతి పరిఢవిల్లే
చేతిపనివారు, నేతపనివారు
వృత్తి పనివారు వర్తకులును
రాతి పరికరాలు రాగి పరికరాలు
రమ్యమైన సరకుల రచన జరిగే
రమణీయ కుండలు నిల్వకు వంటకు కాగా
విలాసాల సరసరసభావుకులకు
పూసలు బిళ్ళలు
బంగారు వెండి నవరత్నాలు
ఆనాటి హరప్ప మహంజదారో
సింధు నాగరికత కౌశలమే
చరిత్ర అందించిన నేటి ప్రగతి
ఇ.హచ్.కార్ అభిభాషణకు నిదర్షనం
(చరిత్ర:
ఇ.హెచ్.కార్ అభిభాషణప్రకారం
ఒకతరం తాను సంపాదించినృకౌశలాన్ని
నేర్పుని ముందు తరాని కి అందివ్వడం వల్ల వచ్చే ప్రగతే చరిత్ర )
*****అవేరా****
10/11/2015
* శీర్షిక: సింధూ నాగరికత *
నాడే సాక్షాత్కారం నాగరిక జీవనం
కుమ్మరి చక్రంతో కమనీయమైన కుండలు
కాల్చిన ఇటుకలతో శతాబ్దాలు నిలిచిన కట్టడాలు
ప్రణాలిక బద్దమై సిద్దమైన భవనాలు
రమ్యమైన రహదారులు
లంబకోణ కూడళ్ళు
మురుగు నీటి పారు దలకు ముచ్చటైన వ్యవస్ధలు
ఇటుక రాయి తాటించిన ఇంపుగ రాణించిన
బావులు చెరువులు
స్మశానానికైనా తీరైన నిర్వహణ
అరక దున్నే ఎద్దు ఒండ్రు భూములు దున్నగా
పసిడి పంట పొలాలు బారులు తీరగా
అటునిటు పచ్చతివాచీతో గంగమ్మకు స్వాగతం పలుకగా
యమునమ్మ కరుణతో
తృణధాన్యాలు, చిరుధాన్యాలు,
బీన్స్ బార్లీ, అవిసె ఆవాలు
ఆశతీరగ పండించి మిగులు దిగుబడి సాధించి
ధాన్యాగారాలు నింపినారు పట్టణాలకు పంపినారు
పల్లెజీవనమీవిధము అలరార
పట్టణాల ప్రగతి పరిఢవిల్లే
చేతిపనివారు, నేతపనివారు
వృత్తి పనివారు వర్తకులును
రాతి పరికరాలు రాగి పరికరాలు
రమ్యమైన సరకుల రచన జరిగే
రమణీయ కుండలు నిల్వకు వంటకు కాగా
విలాసాల సరసరసభావుకులకు
పూసలు బిళ్ళలు
బంగారు వెండి నవరత్నాలు
ఆనాటి హరప్ప మహంజదారో
సింధు నాగరికత కౌశలమే
చరిత్ర అందించిన నేటి ప్రగతి
ఇ.హచ్.కార్ అభిభాషణకు నిదర్షనం
(చరిత్ర:
ఇ.హెచ్.కార్ అభిభాషణప్రకారం
ఒకతరం తాను సంపాదించినృకౌశలాన్ని
నేర్పుని ముందు తరాని కి అందివ్వడం వల్ల వచ్చే ప్రగతే చరిత్ర )
*****అవేరా****
No comments:
Post a Comment