sk101-28
సహస్రకవి సమ్మేళనం
తేది:18-11-2015
వేదిక:వాట్సప్
* శీర్షిక: ఆధునిక బానిసలా ? అంగడిబొమ్మలా? *
విశ్వవ్యాప్త నేరం
మహిళల పట్ల ఘోరం
మానవ అక్రమ రవాణా !
మానవత దివాళా!
మాఫియాల మాయాజాలంలో
వలలోచిక్కిన చేప పిల్లల్లా
విలవిలలాడుతున్నారు మహిళలు,బాలికలు
తేనె పూసిన కత్తుల మాయ మాటలకొకరు
రుణభార విముక్తి కోసం ఒకరు
పెళ్ళి పేర వంచనకు గురై ఒకరు
ఉపాది ప్రలోభాలను నమ్మి ఒకరు
నిర్బంధ వ్యభిచారులౌతున్నారు
వెట్టిచాకిరి కార్మికులౌతున్నారు
ఆధునిక బానిసలౌతున్నారు
నీడ ఇచ్చిన ఇల్లే చరసాల ఔతుంది
పాలు పోసిన చేేతులే విషనాగులై
కాటు వేస్తున్నాయి
స్త్రీత్వపు ఔన్నత్యానికి ద్రోహం
మాఫియా పద్మ వ్యూహం
ఈపద్మవ్యూహాన్ని ఛేధించటానికి
అభిమన్యులు కాదు అర్జునులు కావాలి
పాతచట్టాలకు చిట్టి చిట్టాలు జేర్చి
సంస్కరణల కూర్చితే కాలం వృధా
కనిపించుట లేదా ప్రభుతా ! మహిళల వ్యధ !
అందుకే
సమగ్ర నూతనచట్టం కావాలి
సామాజిక దృక్పధాన మార్పు రావాలి
అమాయకత్వానికి --- నిరక్షరాస్యత
ఆర్ధిక భారానికి --- పేదరికం మూలం
మహిళలకు అక్షరాస్యత-ఆర్దిక పరిపుష్టికావాలి
సమస్యకు శాశ్వతపరిష్కారం తేవాలి
చిరిగిన అరిటాకుని అతుక తరమా
పగిలిన అద్దాన్ని జోడించ తరమా
దెబ్బ తగిలాక గాయనికి కాయకల్ప చికిత్స మాని
గాయాలే లేని గాయాలేకాని వ్యవస్ధ నిర్మాణం కావాలి
మొదటి స్ధానంలో మాదక ద్రవ్యాల రవాణా
ద్వితీయస్ధానంలో మహిళల అక్రమ రవాణా
ఇదీ నేర ప్రపంచం గతి ...ప్రగతి
ఎటు పోతుందీలోకం ? ఏమౌతుందీ దేశం?
ఆధునిక బానిసత్వ రొంపిలోచిక్కిన
అమాయక బాలికలకు మహిళలకు
పునరావాసం కల్పన కల్పవల్లి కావాలి
విద్య,వైద్యం ,ఉపాధి, కల్పనలతో
మానసిక స్ధైర్యం రావాలి
గాఢనిద్రలో ఉన్న స్త్రీ శిశు సంక్షమ శాఖ
కళ్ళు తెరవాలి అన్యధా ఆ శాఖ నిరర్ధకం
ఆ శాఖకు అమాత్య పదవి ప్రశ్నార్ధకం ????
******అవేరా*****
సహస్రకవి సమ్మేళనం
తేది:18-11-2015
వేదిక:వాట్సప్
* శీర్షిక: ఆధునిక బానిసలా ? అంగడిబొమ్మలా? *
విశ్వవ్యాప్త నేరం
మహిళల పట్ల ఘోరం
మానవ అక్రమ రవాణా !
మానవత దివాళా!
మాఫియాల మాయాజాలంలో
వలలోచిక్కిన చేప పిల్లల్లా
విలవిలలాడుతున్నారు మహిళలు,బాలికలు
తేనె పూసిన కత్తుల మాయ మాటలకొకరు
రుణభార విముక్తి కోసం ఒకరు
పెళ్ళి పేర వంచనకు గురై ఒకరు
ఉపాది ప్రలోభాలను నమ్మి ఒకరు
నిర్బంధ వ్యభిచారులౌతున్నారు
వెట్టిచాకిరి కార్మికులౌతున్నారు
ఆధునిక బానిసలౌతున్నారు
నీడ ఇచ్చిన ఇల్లే చరసాల ఔతుంది
పాలు పోసిన చేేతులే విషనాగులై
కాటు వేస్తున్నాయి
స్త్రీత్వపు ఔన్నత్యానికి ద్రోహం
మాఫియా పద్మ వ్యూహం
ఈపద్మవ్యూహాన్ని ఛేధించటానికి
అభిమన్యులు కాదు అర్జునులు కావాలి
పాతచట్టాలకు చిట్టి చిట్టాలు జేర్చి
సంస్కరణల కూర్చితే కాలం వృధా
కనిపించుట లేదా ప్రభుతా ! మహిళల వ్యధ !
అందుకే
సమగ్ర నూతనచట్టం కావాలి
సామాజిక దృక్పధాన మార్పు రావాలి
అమాయకత్వానికి --- నిరక్షరాస్యత
ఆర్ధిక భారానికి --- పేదరికం మూలం
మహిళలకు అక్షరాస్యత-ఆర్దిక పరిపుష్టికావాలి
సమస్యకు శాశ్వతపరిష్కారం తేవాలి
చిరిగిన అరిటాకుని అతుక తరమా
పగిలిన అద్దాన్ని జోడించ తరమా
దెబ్బ తగిలాక గాయనికి కాయకల్ప చికిత్స మాని
గాయాలే లేని గాయాలేకాని వ్యవస్ధ నిర్మాణం కావాలి
మొదటి స్ధానంలో మాదక ద్రవ్యాల రవాణా
ద్వితీయస్ధానంలో మహిళల అక్రమ రవాణా
ఇదీ నేర ప్రపంచం గతి ...ప్రగతి
ఎటు పోతుందీలోకం ? ఏమౌతుందీ దేశం?
ఆధునిక బానిసత్వ రొంపిలోచిక్కిన
అమాయక బాలికలకు మహిళలకు
పునరావాసం కల్పన కల్పవల్లి కావాలి
విద్య,వైద్యం ,ఉపాధి, కల్పనలతో
మానసిక స్ధైర్యం రావాలి
గాఢనిద్రలో ఉన్న స్త్రీ శిశు సంక్షమ శాఖ
కళ్ళు తెరవాలి అన్యధా ఆ శాఖ నిరర్ధకం
ఆ శాఖకు అమాత్య పదవి ప్రశ్నార్ధకం ????
******అవేరా*****
No comments:
Post a Comment