Tuesday, October 2, 2018

20/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:280
కవి:కవిరత్న అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: తప్పులెంచకు!
మనిషిగా పుట్టడం ఎంతదృష్టం?
ఆలోచిస్తూ నవవసంత
లేలేత చిగురాకుల
వృక్ష సొబగులతోనున్న
ప్రకృతిలో పరవశిస్తున్న వేళ
మలయమారుతాలు
వికసించిన తరుల
చిగురించిన చిగురాకులతో
గుసగుసలాడే సమయాన
మంద్రమైన మధుర
గంధర్వ గానం
కుహూ....కుహూ యంటూ
ఓ గండు కోయిల
పరవశాన కూసిన
తీయని పాటతో
పరవశించి పోయాను...
తరచి చూడగా
చిటారు కొమ్మన
దాగిన గండు కోయిల
కనిపించింది....
"ఓ గాన గంధర్వా!
నీ మధుర పాటలతో
ప్రకృతిని పరవశింప జేస్తున్నావు!
ఆ విధాత నిన్ను నల్లగా కాకుండా తెల్లగా
పుట్టించి వుంటే ఎంత బాగుండును!"
అన్న నా సందేహానికి
"మానవా నీకు ఉత్తమమైన
మానవ జన్మ నిచ్చిన విధాతనే
విమర్షంచేతటి వాడివా?
ఆయన ప్రతి నిర్ణయానికి
ఒక కారణముంటుంది.
నేను నల్లని రూపులో వుండుట చేతనే
నన్ను మీ మనుషులు ఆహారంగా
భుజించలేకున్నారని నేననుకుంటున్నాను
నల్లగా వుండుట చేతనే
గుట్టుగా చెట్టుకొమ్మల చాటున
జీవనం వెళ్ళదీసుకుంటున్నాను
నలుపు రంగు ఆ విధాత
నాకిచ్చిన వరంగా భావిస్తున్నా!
నీవుకూడా ఇతరులలో
తప్పులెంచక నీలోని
తప్పులెంచుకుని
నిన్ను నీవు సరిదిద్దుకో...!"
అని తుర్రున మరో కొమ్మకు
ఎగిరిపోయింది గడుసు కోయిలమ్మ!
ఆత్మ విమర్షలో లీనమై
ఉధ్యానవన సమీపమునకు రాగా
ఎర్రని గులాబీల తోటలో
వికసించి మధుర
సుగంధాల పరిమళాలు
ప్రకృతికి పంచుతున్న
సొగసు బాల
గులాబీ కనిపించింది
"ఓ గులాబీ బాలా
ఏమందము నీది
స్నిగ్ద సుకుమార
రేకుల సోయగాన్ని
ఏమని వర్ణించను
నీ సుకుమార సోయగానికి
ఈ కంటకములు లేకున్న
ఎంత బాగుండునో కదా"
యంటిని..!
అప్పుడా గులాబీ బాల
ఓయీ మానవుడా
యా విరించి నిర్ణయాలనే
ప్రశ్నంచగల వాడివా?
ఆ కంటకములే లేకున్న
జంతువులన్నియు
నన్నాహరముగా జేసికొని
నా ప్రాణములు తీయునని
ఏల తెలియకున్నావు?
ఇతరులను విమర్షించుట
మాని నిన్ను నీవు
విమర్షించుకో
సంస్కరించుకో...!
అందా గులాబీ బాల..!
మనసంతా ఆందోళన
నిండగా
సేద దీరుటకు
సముద్ర తటమునకేతెంచి
అరుణారుణ కాంతులతో
ఎరుపెక్కిన ఆకాశ కాంతిలో
సాయం సంధ్యలో
సముద్రుని మెరిసే
మేనికాంతి చూస్తూ
పరవశిస్తున్నంతలో మనసున
మెదిలిందొక సందేహం
"ఇంతటి మహా సముద్రంలో
ఉప్పు నీరు కాకుండా
తీయని నీటితో
నింపి యుండిన
మనుషులకు త్రాగునీటి బాధ తప్పేది కదా!"
ఇంతలో సముద్రుడు
అశరీర వాణితో
"మానవా సృష్టిలో
దేనినెలా అమర్చాలో
ఆ విధాతకు తెలుసు!
నేనే కనుక ఉప్పు నీటితో
వుండని యెడల
నీ ఆరోగ్యాన్ని పరిరక్షించే
నీ షడ్రుచులలో ఒకటైన
వుప్పు లేకుండా జీవించ గలవా!
ఉప్పు నీటిలో
నా గర్భమున
జీవనము సాగిస్తున్న
కోట్ల జీవరాశుల
మనుగడేల ఆలోచించవు?
అనవసరముగా
ఇతరులలో తప్పులెంచక
నీలోని వ్యతిరేక ఆలోచనా
విధానాన్ని వీడి
అనుకూల ఆలోచనా
విధానాన్ని అలవరచుకో...!"
అనగా సిగ్గుతో...
ఆలోచిస్తూ...పైన ఆకాశంలో
నీలి మేఘాలను చూస్తూ...
"ఆహా ఇప్పుడీ మేఘాలు
వర్షస్తే ఎంత బాగుంటుంది...!"
అని రెండడుగులు వేసానో లేదో
క్షణాల్లో శీతల పవనాలు
వణికిస్తుంటే....
ఆకాశం వర్షిస్తుంటే...
పరవశంలో నేను....!
"ఇది కదా
అనుకూల ఆలోచన" అనుకుంటూ...!
****అవేరా***

No comments:

Post a Comment