Tuesday, October 2, 2018

16/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:278
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: పాపం పసివాళ్ళు
పాపం పుణ్యం
ఎరుగని వారూ
కష్టం సుఖం
తెలియని వారూ
పాలబుగ్గలే
కరుగని వారూ....మీరూ
ఓ....పిల్లల్లారా...ఓ....పాపల్లారా....!
మెరుపు మెరిస్తే
కనుల కాంతులే
వాన కురిస్తే
మేని కుదుపులే
చూరుల క్రిందన
చేతులు పెడుతూ
జారేముత్యం
పగడపుచేతుల పడుతూ
బుల్లిచేతులూ
పడవలు చేస్తూ
జలనిధినొదుల్తూ
ఉరుము ఉరిమితే
ఉరుకులు పరుగులు.....పాపంపుణ్యం
నోట్లో వేలూ
ముద్దు పలుకులూ
బుడిబుడి నడకలు
వడివడి పరుగులు
పచ్చిక బయలున
పరుగుల ఆటలు
హద్దలు లేని
అల్లరి ఆటలు
ఇక్కడమునిగీ
అక్కడతేలి
అమ్మా నాన్నల
వెతుకులాటలూ.....పాపంపుణ్యం
మీరే...మీరే....మీరే..!
రేపటి భవితకు
భారతమాతకు
భాగ్యవిధాతలు!
జ్ఞాన రోచకపు
దీప కాంతులు.!.
మదిరేతస్సుల
కీర్తి ఉషస్సులు!
మీరే.....మీరే.....మీరే...!..........పాపంపుణ్యం
మీదే....మీదే...మీదే..!
కోయిల పాటలు
కొత్త చిగుర్లూ
వసంతకాలపు
ఉషస్సులన్నీ
చిగురుల ఆశల
కలలప్రపంచం
మీదే..మీదే...మీదే...!........పాపంపుణ్యం
సవ్వడిచేస్తూ
జువ్వలవోలె
పరుగులుపెట్టే
నదీనదాలై
మెరుపైమెరిసే
కాంతిపుంజమై
వివాదాలనూ
ప్రమాదలనూ
ప్రమోద మొందగ దాటండీ.....!
సమతకు భవితకు
వారసులంటూ.......
ఇలాతలమునచాటండీ.................పాపంపుణ్యం
****అవేరా***

No comments:

Post a Comment