Tuesday, October 2, 2018

20/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:280
కవి:కవిరత్న అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: తప్పులెంచకు!
మనిషిగా పుట్టడం ఎంతదృష్టం?
ఆలోచిస్తూ నవవసంత
లేలేత చిగురాకుల
వృక్ష సొబగులతోనున్న
ప్రకృతిలో పరవశిస్తున్న వేళ
మలయమారుతాలు
వికసించిన తరుల
చిగురించిన చిగురాకులతో
గుసగుసలాడే సమయాన
మంద్రమైన మధుర
గంధర్వ గానం
కుహూ....కుహూ యంటూ
ఓ గండు కోయిల
పరవశాన కూసిన
తీయని పాటతో
పరవశించి పోయాను...
తరచి చూడగా
చిటారు కొమ్మన
దాగిన గండు కోయిల
కనిపించింది....
"ఓ గాన గంధర్వా!
నీ మధుర పాటలతో
ప్రకృతిని పరవశింప జేస్తున్నావు!
ఆ విధాత నిన్ను నల్లగా కాకుండా తెల్లగా
పుట్టించి వుంటే ఎంత బాగుండును!"
అన్న నా సందేహానికి
"మానవా నీకు ఉత్తమమైన
మానవ జన్మ నిచ్చిన విధాతనే
విమర్షంచేతటి వాడివా?
ఆయన ప్రతి నిర్ణయానికి
ఒక కారణముంటుంది.
నేను నల్లని రూపులో వుండుట చేతనే
నన్ను మీ మనుషులు ఆహారంగా
భుజించలేకున్నారని నేననుకుంటున్నాను
నల్లగా వుండుట చేతనే
గుట్టుగా చెట్టుకొమ్మల చాటున
జీవనం వెళ్ళదీసుకుంటున్నాను
నలుపు రంగు ఆ విధాత
నాకిచ్చిన వరంగా భావిస్తున్నా!
నీవుకూడా ఇతరులలో
తప్పులెంచక నీలోని
తప్పులెంచుకుని
నిన్ను నీవు సరిదిద్దుకో...!"
అని తుర్రున మరో కొమ్మకు
ఎగిరిపోయింది గడుసు కోయిలమ్మ!
ఆత్మ విమర్షలో లీనమై
ఉధ్యానవన సమీపమునకు రాగా
ఎర్రని గులాబీల తోటలో
వికసించి మధుర
సుగంధాల పరిమళాలు
ప్రకృతికి పంచుతున్న
సొగసు బాల
గులాబీ కనిపించింది
"ఓ గులాబీ బాలా
ఏమందము నీది
స్నిగ్ద సుకుమార
రేకుల సోయగాన్ని
ఏమని వర్ణించను
నీ సుకుమార సోయగానికి
ఈ కంటకములు లేకున్న
ఎంత బాగుండునో కదా"
యంటిని..!
అప్పుడా గులాబీ బాల
ఓయీ మానవుడా
యా విరించి నిర్ణయాలనే
ప్రశ్నంచగల వాడివా?
ఆ కంటకములే లేకున్న
జంతువులన్నియు
నన్నాహరముగా జేసికొని
నా ప్రాణములు తీయునని
ఏల తెలియకున్నావు?
ఇతరులను విమర్షించుట
మాని నిన్ను నీవు
విమర్షించుకో
సంస్కరించుకో...!
అందా గులాబీ బాల..!
మనసంతా ఆందోళన
నిండగా
సేద దీరుటకు
సముద్ర తటమునకేతెంచి
అరుణారుణ కాంతులతో
ఎరుపెక్కిన ఆకాశ కాంతిలో
సాయం సంధ్యలో
సముద్రుని మెరిసే
మేనికాంతి చూస్తూ
పరవశిస్తున్నంతలో మనసున
మెదిలిందొక సందేహం
"ఇంతటి మహా సముద్రంలో
ఉప్పు నీరు కాకుండా
తీయని నీటితో
నింపి యుండిన
మనుషులకు త్రాగునీటి బాధ తప్పేది కదా!"
ఇంతలో సముద్రుడు
అశరీర వాణితో
"మానవా సృష్టిలో
దేనినెలా అమర్చాలో
ఆ విధాతకు తెలుసు!
నేనే కనుక ఉప్పు నీటితో
వుండని యెడల
నీ ఆరోగ్యాన్ని పరిరక్షించే
నీ షడ్రుచులలో ఒకటైన
వుప్పు లేకుండా జీవించ గలవా!
ఉప్పు నీటిలో
నా గర్భమున
జీవనము సాగిస్తున్న
కోట్ల జీవరాశుల
మనుగడేల ఆలోచించవు?
అనవసరముగా
ఇతరులలో తప్పులెంచక
నీలోని వ్యతిరేక ఆలోచనా
విధానాన్ని వీడి
అనుకూల ఆలోచనా
విధానాన్ని అలవరచుకో...!"
అనగా సిగ్గుతో...
ఆలోచిస్తూ...పైన ఆకాశంలో
నీలి మేఘాలను చూస్తూ...
"ఆహా ఇప్పుడీ మేఘాలు
వర్షస్తే ఎంత బాగుంటుంది...!"
అని రెండడుగులు వేసానో లేదో
క్షణాల్లో శీతల పవనాలు
వణికిస్తుంటే....
ఆకాశం వర్షిస్తుంటే...
పరవశంలో నేను....!
"ఇది కదా
అనుకూల ఆలోచన" అనుకుంటూ...!
****అవేరా***
16/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:278
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: పాపం పసివాళ్ళు
పాపం పుణ్యం
ఎరుగని వారూ
కష్టం సుఖం
తెలియని వారూ
పాలబుగ్గలే
కరుగని వారూ....మీరూ
ఓ....పిల్లల్లారా...ఓ....పాపల్లారా....!
మెరుపు మెరిస్తే
కనుల కాంతులే
వాన కురిస్తే
మేని కుదుపులే
చూరుల క్రిందన
చేతులు పెడుతూ
జారేముత్యం
పగడపుచేతుల పడుతూ
బుల్లిచేతులూ
పడవలు చేస్తూ
జలనిధినొదుల్తూ
ఉరుము ఉరిమితే
ఉరుకులు పరుగులు.....పాపంపుణ్యం
నోట్లో వేలూ
ముద్దు పలుకులూ
బుడిబుడి నడకలు
వడివడి పరుగులు
పచ్చిక బయలున
పరుగుల ఆటలు
హద్దలు లేని
అల్లరి ఆటలు
ఇక్కడమునిగీ
అక్కడతేలి
అమ్మా నాన్నల
వెతుకులాటలూ.....పాపంపుణ్యం
మీరే...మీరే....మీరే..!
రేపటి భవితకు
భారతమాతకు
భాగ్యవిధాతలు!
జ్ఞాన రోచకపు
దీప కాంతులు.!.
మదిరేతస్సుల
కీర్తి ఉషస్సులు!
మీరే.....మీరే.....మీరే...!..........పాపంపుణ్యం
మీదే....మీదే...మీదే..!
కోయిల పాటలు
కొత్త చిగుర్లూ
వసంతకాలపు
ఉషస్సులన్నీ
చిగురుల ఆశల
కలలప్రపంచం
మీదే..మీదే...మీదే...!........పాపంపుణ్యం
సవ్వడిచేస్తూ
జువ్వలవోలె
పరుగులుపెట్టే
నదీనదాలై
మెరుపైమెరిసే
కాంతిపుంజమై
వివాదాలనూ
ప్రమాదలనూ
ప్రమోద మొందగ దాటండీ.....!
సమతకు భవితకు
వారసులంటూ.......
ఇలాతలమునచాటండీ.................పాపంపుణ్యం
****అవేరా***
18/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:279
కవి: సహస్ర కవిరత్న అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: నవసృష్టి బీజం!
ఉజ్జీవ నావను నేను!
అఖండమైన జలనిధిలోన
లంగరు లేని నావను నేను!
చుక్కానెరుగని జీవము నేను!
చండ్ర మారుతముల
తుఫానులేస్తూ,
అర్నవలోతుల
భూకంపాలు,
సునామీలై ఎదురైతే,
పలాయనంలో,
పరిభ్రమిస్తూ,
సముద్రఘోషల,
మంద్రమారుతముల,
జలనిధి పై
నే విహరిస్తూ,
ప్రభవ
విభవమున
మనము రమిస్తూ,
అరిషఢ్వర్గపు
ఆవిరుడుకుతూ,
కుత...కుత....కుత...కుత,
కుత కుతలాడుతూ!
ఇహమే పరమని భ్రమిస్తూ...
పరిభ్రమిస్తూ...!
పరిభ్రమించే
ప్రణవము గానక,
పరిశ్రమించే
ప్రణయ రాగమున,
అదియని,
ఇదియని,
అన్నీ నాయని,
చిల్లులు పడిన
జల్లెడ నావగ,
కొంచెం ....కొంచెం,
సాంతం...సాంతం,
జలధిన మునిగే,
ప్రాణము లేని
జలాంతర్గామిలా..!
లవణపు జలధిన,
విమల హస్తమున,
మునుగుచు...తేలుచు,
వైతరిణి దేలీ,
పడుతూ..... లేస్తూ,
ఉనికే లేకా వెలుగేరాకా,
చీకటి దారిన చీమునెత్తురుల,
దారుల నడవగ,
కపాల నాడులు
ఖణిల్లుతుంటే.....,
విధాత నవసృష్టికి ,
పంక్తిన జేరితి,
మరోబీజమై....!
***అవేరా***
అవేరా నానీలు
25/5/18
అవేరా: అవేరా నానీలు
1.
వాడి సంచి 
పుస్తకాలతో నింపాను
నా కాగితాల
జేబుసంచి వొంపుకున్నా
2
విత్తులు 
మొలకలిస్తాయనుకున్నా
కన్నీటి 
వత్తులౌతాయనుకోలేదు
3
దీపం వెలిగిస్తే
కంటికివెలుగు
ఇంటిదీపం మలిగిస్తే
కంటనీరు
4
లేకుంటే
జలం
కదుల్తుందా
హలం?
5
కలాన్ని 
కాటికంపారు
పేదల బలాన్ని
బలిచేశారు
6
ద్వేషాగ్ని రగిలింది
వారినడుమ
మల్లెల జల్లుతో
చల్లబడింది
7
వాడిని 
మసిచేసి
వాడినుదుట
మసిపూసుకున్నాడు
8
కలాన్ని 
కాటికంపారు
పేదల బలాన్ని
బలిచేశారు
9
వయసుపరుగెడుతుంది
ముందుకు
ఆయుష్షు పరుగెడుతుంది
వెనక్కు
10
సంసారం 
ఒక బ్రాంతి
కాషాయంలోనే
ఇక శాంతి
11
ఉగ్రక్రీడ 
రాక్షసులది
శాంతిమాట
అగ్రరాజ్యాలది
12
కొల్లేరులో
కొంపకడదామంటే
వున్నకొంప
కొల్లేరయింది
13
నీవులేక
క్షణం యుగమైంది
నీవుంటే
యుగమే క్షణమైంది
*****averao****
Title:my soul with you

my soul can feel the touch of a miracle caduceous
confused how to express the love
how do i love thee...?
let me fathom the vast depth of the ocean
when you are out there far miles away  i reach you
i love thee breath with in 
i love thee in my smile in  your's 
i love thee in my tears in your grief
i love thee  my soul in your's
if not in life i choose it after its end
****averao**