Thursday, February 4, 2016

అవేరా కవితలు 125 to 175

అయుత కవితా యజ్ఞం
17/01/2016
సహస్రకవి:101
కవిత నెం:126
కవి:అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: సామాజికం
శీర్షిక::వసతి గృహం (హాస్టల్)


ఆకాశంలో విహరిస్తున్నాయి
ఆశలు పక్షులై
అందుకునే నిచ్చెనలనుకున్న
అమాయక బడుగు జీవులు
కన్న నలుసుల కడుపాకలి
తీర్చలేక ఎదుగు దల
నిచ్చనగా ప్రభుత్వ వసతిగృహంలో
చేర్చి నిట్టూర్చారు నిశ్చింతగా ....

కానీ.....

పేద బాలల కోసం
ప్రభుత్వ వసతి గృహాలు
ఆర్థిక స్తోమతు లేక
దారిద్ర్యరేఖకు దిగువన
మ్రగ్గుతున్న దళిత  గిరిజన
వెనుకబడిన  బాలల
అక్షరాస్యత సంక్షేమాలే
ధ్యేయంగా వెలసిన దేవాలయాలు

కేజీ నుంచి పీజీ వరకు
నూతన విద్యా విధానం
పరిశీలనలో తనిఖీలో
నివేదికల్లో ......
వెల్లడై వెక్కిరిస్తున్న
నగ్న సత్యాలు ...
తిష్ట వేసిన సమస్యలు ...

స్వచ్చత కరవై
మురుగు నెలవైనవి
మరుగుదొడ్లు కరువైనవి
స్వచ్చ భారత్ కలలు కల్లలైనవి ....

సగానికి సగం హాస్టళ్ళు
స్నానపు గదులు లేక
శుభ్రత లేని మరికి కూపాలయి
కంపుకు ఇంపైన నెలవులైనాయి ....
అనారోగ్యానికి హేతువైనాయి ....

అగుపించని ఆహార పట్టికలు
అందని అధికారిక ఆహారం
పాలు గుడ్లు పిల్లుల(వార్డన్ల)పాలు
అల్పాహారం మాంసాహారం
కుక్కల(అధికారుల) పాలు
నాణ్యతలేని ఆహారం గ
సన్నగిల్లిన సన్న బియ్యం
అడ్రస్ లేని ఆర్వో ప్లాంట్లు
భూతద్దంలో వెతికినా
కనిపించని ఆహార నాణ్యత
బలి అవుతున్న రేపటి పౌరులు
అటకెక్కిన చదువులు
ఎండమావులైనవి బడుగుల "కలలు"
వసతిగృహాల్లో అర్ధాకలి బతుకులు ...
అపనమ్మకంలో ఖాళీల వెల్లువ....

దూరమైన దుస్తులు
దొరకని దుప్పట్లు
పంపిణీ కరువైన పుస్తకాలు
నాణ్యత కరువైన పెట్టెలు

కారణాల లోతుల్లో
చీకటి కోణాలెన్నో
అరకొర బడ్జట్
అవినీతి రాజ్యం
మిల్లర్ల బోజ్యం
అధికారుల చోద్యం
కరువైన పర్యవేక్షణ
వెరసి చితుకుతున్న
బడుగుల బతుకులు ...
   ****అ వే రా****


అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
19/01/2016
సహస్రకవి101
కవితనెం:127
కవి:అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం :భక్తి
శీర్షిక: జయవిఘ్నేశ్వర

జయవిఘ్నేశ్వర జయజయహో
జయజయ శుభకర  జయజయహో

జయకర శుభకర  సర్వపరాత్పర
జగద్రక్షకా విజయ కారకా....జయవిఘ్నేశ్వర

జగద్వాపితా జగదుద్దారా
కరుణాదృక్కుల భక్తోద్దారా .....జయ విఘ్నేశ్వర

సర్వసిద్ది ప్రదా తారకా
వందేహంశ్రీ గణ నాయకా ....జయ విఘ్నేశ్వర

ప్రకృతి ప్రణవము నీ పూజ
భక్తితో కొలుతును ఓ దేవా ...జయ విఘ్నేశ్వర

ఫల పత్ర పుష్పాలతో
ఏకవింశతి  నీకేనయ్యా.....జయ విఘ్నేశ్వర

గారెలు బూరెలు నారికేళములు
కుడుములు ఉండ్రాళ్ళు నీకేనయ్యా ...జయ విఘ్నేశ్వర

రసాయనాలను త్యజింతుమయ్యా
మట్టి మూర్తులనే కొలిచెదమయ్యా...జయ విఘ్నేశ్వర

పర్యావరణం కాపాడయ్యా
నీ భక్తులను బ్రోవుమయ్యా...జయ విఘ్నేశ్వర

ప్రదివై భక్తుల కోరిక తీర్చగ
ప్రణవనాదము పలికించయ్యా....జయ విఘ్నేశ్వర

      ******అ  వే  రా *******
అయుతకవితాయజ్ఞం
20/01/2016
సహస్రకవి101
కవితసంఖ్య:128
కవి:అనుసూరివేంకటేశ్వరరావు
అంశం:సామాజికం
శీర్శిక :జ్ఞానజ్యోతి

పల్లవి:క్షణం క్షణం అన్వేషణ
          అనుక్షణం ఆందోళన

చిటుకు చిటుకు చిటికెలేస్తు
బతుకుబాట పయనిస్తే

లటకు లటకు లంఘిస్తూ
ఎటకెటకో పయనిస్తే .

జరాజరా జరఅంటూ
బిరాబిరా పరుగెడితే ..........క్షణంక్షణం

అలాఅలా అగుపించే
ఒయాసీస్సు లొకవైపూ

రారమ్మని పిలిచేటీ
ఎండమావులొకవైపూ

బ్రతుకు బ్రతుకు కొక వేట
ఏదీ జీవన బాట ??............క్షణం క్షణం

వెతికి వెతికి వేసారిన
బ్రతుకే చితుకును ఏటా

చెడామడా వెతుక్కుంటు
లబోదిబోమంటావు

ఎడా పెడా దెబ్బతిని
బొక్కబోర్లపడతావు ....క్షణం క్షణం

ఆశఆశ అడియాసై
విధాతనే అంటావు

రెపరెపల గాలిలోన దీపంలా
ఎన్నాళ్ళని వుంటావు

మదిమదిలో జ్ఞానమున్న
అడుగడుగున అవకాశం

వెలవెల బోకుండా వెలుగుదివ్వైవెలుగు
జ్ణాన జ్యోతి వెలిగించు జ్యోతివై ప్రభవించు ...!!
     ****అ వే రా ****
అయుతకవితాయజ్ఞం
21/01/2016
సహస్రకవి:101
కవిత సంఖ్య 129
కవి: అనుసూరివేంకటేశ్వరరావు
అంశం:ప్రకృతి
శీర్షిక: అంకురం

వనంలోకి వసంతాగమనం
మార్చేసింది మేని రంగు
వనం మేను పచ్చదనం అచ్చాదనలో
పచ్చరంగుకే స్వచ్చ నిర్వచనంలా వుంది
ఆ అందాలన్నొక్కసారి ఆస్వాదించాలని
నింగి నుండి తొంగి చూసింది
పుడమిపై వ్రాలింది వానచినుకు
ఆ వర్షపు చినుకు పుడమిని చేరి కులికింది
విత్తనంలో ప్రాణం పలికింది
నిన్నటి విత్తనం.....
నేడు అంకురమయ్యింది ..
మొలకగా మారింది
అరవిచ్చిన నునుమెత్తని
ఆకులు లేలేత పచ్చని
సింగారం నింపుకున్నాయి
గాలి.. ఆకుల కోమలత్వాన్ని
మెల్లగా తాకి ఆస్వాదిస్తుంది ...
ఆకలంటూ ఆకాశాన్ని
ఆశగా చూస్తున్న ఆకులను
సుతారంగా తాకాయి
ప్రత్యూష కిరణాలు
చనుబాలై ఆకలి తీర్చాయి....
పంచభూతాలలో మమేకమయ్యాయి
చిగురించిన మొక్కలు .....
ఈ కవనానికి సిరా(సిరి)చుక్కలు...!!
   *****అ వే రా****
అయుత కవితా యజ్ఞం
21/01/2016
సహస్రకవి101
కవిత సంఖ్య:130
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం :సామాజికం

శీర్షిక:  పంట భీమా ! రైతు ఖైమా!

ఆశల  పల్లకిలో  ఊరేగే రైతన్నా !
నీ బోయీలు జీవితకాలం లేటన్నా !
పరిహారం కోసమని పరుగున వెళ్ళావు
పరిహాసం పాలయ్యి సొక్కి సొక్కి వచ్చావు
పంట భీమా చేసినా మొండి చెయ్యేనన్నా!
ఖాతాల్లో జమకాక కాకెత్తుకు పొయ్యిందా..?
నీ చెమట నోటు ఎవ్వడికయ్యెనో రక్తపు కూడు?
అయోమయం మాయొద్దు !
బేలతనం నీకొద్దు .!
నీ హక్కుకై పోరాడు
వినియోగదారుల ఫోరం నీకున్నది అండగా ...!!
       *****అ వే రా *****
అయుత కవితా యజ్ఞం
 21/01/2016
సహస్రకవి101
కవిత సంఖ్య:131
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: విద్య
శీర్శిక: సమయం విలువ

గడిచిపోయింది నిన్న
ఏమౌతుందో రేపు
సమయం ఆగదు నీకోసం
అలసట భావం సోమరితనం
సోమరితనంతో కాలం ఒలకపోత
ఉన్న సమయమే పిడికిలంత
కాలంలో ధనవంతులం కాదు
కాలంవిలువ తెలిసినవాడే
విజయుడు
కాలం పొదుపు తెలిసినవాడే విజ్ఞుడు

విజేత పరాజితుల మద్య
వ్యత్యాసం సమయ సద్వినియోగమే
ప్రణాళిక బద్దమై సాగాలి చదువు
సమయపాలనే సత్ఫలితాల నెలవు

అమ్మతొలిగురువు
నాన్నతొలినేస్తం
పరీక్షాసమయాల్లో
మార్గదర్శులవ్వాలి
వత్తిడిని తగ్గించే
మంచి మిత్రులు
పుస్తకాలు
ధైర్యానికి
జ్ఞానానికి
వికాసానికీ
పూర్ణకుంబాలు

నిన్నటిరోజు
కాలంచెల్లిన చెక్కు
రేపు ప్రామిసరీ నోటు
డబ్బు సమయం
రెండూఒకటే ...

విద్యార్థికి పుస్తక పఠనమే
కాలక్షేపం కావాలీ
విద్యార్థి దశకి కీలకం
లక్ష్యం ఉండాలి ...

మనసు
కలలో వున్నా
ఇలలో వున్నా
చెదరని లక్ష్యం వుండాలి
మత్స్యయంత్రాన్ని కొట్టాలి....!!
    *****అ వే   రా ***
అయుత  కవితా యజ్ఞం
22/01/2016
సహస్రకవి101
కవిత సంఖ్య:132
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: ప్రకృతి
శీర్షిక: ప్లాస్టిక్ పుష్పాలు
       ******
జలపుష్పాలు జలకాలాటలతో
సముద్రాలు కళ కళ లాడుతున్నయి
ఆ కళ మూణ్ణాళ్ళ ముచ్చటేనా??
సముద్రాలను నమ్మి
జీవిస్తున్న కోట్ల జీవులకు
ప్లాస్టిక్ సునామీ తాకనున్నది
నిన్నటి తిమంగలాల
గుంపు మరణాలకు కారణం?
గ్లోబల్ వార్మింగా ?
ప్లాస్టిక్ వార్నింగా?
సముద్రాలన్నీ రేపటి
ప్లాస్టిక్ పుష్పాలకు నెలవులు కానున్నవి
కొలనుల తేలియాడు
తామర, కలువల వలె
సముద్రాన తేలియాడనున్నాయి
ప్లాస్టిక్ పుష్పాలై...!

మొన్నటి స్వర్ణ యుగం ...
నిన్నటి లోహయుగం ....
నేటి ప్లాస్టిక్ యుగం ....
రేపటి నష్టాల యుగం ...
ఎల్లుండి కష్టాల యుగం .....
ప్లాస్టిక్ ఆధునిక బంగారం!
అన్నింటిలో ఒదిగిన సింగారం
ఈ నాటి పాలాస్టిక్ పొదుపు
రేపటి పర్యావరణ గెలుపు ...

ఇందుగలదందులేదను
సందేహము వలదు
ఎందెందు వెతికి చూచినా
అందందు కలదు
ప్లాస్టిక్ సర్వోపగతమ్ము .....

ఆర్థిక రంగ మూలాలు
మునుగుతున్నవి
ప్లాస్టిక్ మత్తులో
విశ్వ వ్యాప్తమైనది
విచ్చలవిడి వాడకం
ఏటా ఉత్పత్తులు
ఎనిమిది కోట్ల టన్నులు
పుట్టుకతోనే వ్యర్థమై
ప్రకృతికి అనర్థమై
మూడు కోట్ల టన్నులు
సముద్రం పాలై
ముంచుతున్నవి పర్యావరణాన్ని

ప్లాస్టిక్ వ్యర్థాలు
పారిశుద్ద కార్మికుని గండాలు
మురుగు కాల్వల
మూసివేసి
ముప్పుతిప్పలు పెడతాయి
పట్టణాలనే వరదల్లో
ముంచుతాయి

సెకనుకు పదమూడు లక్షల టన్నులు
ప్లాస్టిక్ వ్యర్థాలు
సముద్రమురికిగా  చేరినా
శుద్ది యంత్రాంగం కరవై
మిన్నంటుతుంది సముద్రఘోష
ఎవరికర్థమౌతుంది వేదనా భాష??
మురికి చేసి శుద్ది చేయుటేల
" అడుసు తొక్కనేల
కాలు కడుగనేల " అన్న చందంగా
సముద్ర మురికిని అరికడదాం
సముద్ర జీవజాతులను కాపాడుదాం ...!!
        ****అ వే రా ****
అయుత కవితా యజ్ఞం
23/01/2016
సహస్ర కవి :101
కవిత సంఖ్య: 133
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: ఆధ్యాత్మికం
శీర్షిక: జీవన దఃఖం-ఆధ్యాత్మిక సౌఖ్యం

అమ్మ కడుపులో
అలౌకిక ఆనంద సాగరం
ఒడ్డుకు చేరితే జననం ...
భూమ్మీద పడగానే
ఆకలి దప్పుల ఆరాటం
అనారోగ్యంతో పోరాటం
మాట నేర్వటంలో కష్టం
నడక శిక్షణలో కష్టం
అమ్మ ఒడిని వదలి
బడికి వెళ్ళటం కష్టం
బాలారిష్టాలు దాటి
చేరే మరో మజిలీ .....

కౌమార్యం ...
ఈ దశలో పోటీ..పోటీ ...పోటీ...
అన్నదమ్ములతో అన్నింట్లో పోటీ
చదువులో పోటీ
ఉపాది కోసం పోటీ
అడుగడుగునా జీవన యుద్ధం!
ఆపైన ప్రేమ కోసం ఆరాటం
అన్వేషణ లో పోరాటం
వివాహానికి తపన ...
మూణ్ణాళ్ళ ముచ్చట ....
ముగుస్తూనే సమస్యల తో"రణం" !
సంతానం ...
ఆలన
లాలన
పాలన
పోషణలో పోరు
పోరు ముగిసే వరకు
కబళించే వార్థక్యం
శిథిలమైన శరీరం
వ్యాధుల పీడ
అయినా విశ్రాంతి ఎక్కడ??
ఆత్మానందం ఎక్కడ?
ఆత్మ వికాసమెక్కడ?
ఆత్మోన్నతి ఎక్కడ?
అన్వేషణకి అంతం ఎప్పుడు?

మానవజీవనం దుఃఖబాజనమేనా?
అమితానందామృతం
ఆధ్యాత్మికతలో దాగివుందన్నది సత్యం
అన్వేషణలో చేయాలి నిత్యం
గంగా స్నానం
దైవ ధ్యానం
భక్తి గానం
అభిషేక జలతీర్థ పానం
వయసేదయినా
బాలలైనా
యువకులైనా
వృద్ధులైనా
ఆధ్యాత్మికానందానికి
మానవజన్మ సార్థకానికి
మార్గాన్వేషణకిదే పరిష్కారం!
     ****అ వే రా ****
అయుత కవితా యజ్ఞం
24/01/2016
సహస్రకవి: 101
కవిత సంఖ్య: 134
కవి : అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: ఎన్నికలు

శీర్షిక: గ్రేటర్ ఎన్నిక(ల)లు

గ్రేటర్ ఎన్నికలకు తెర తొలగింది
ఎత్తులకు పై ఎత్తులు
పార్టీల కుయుక్తులతో
సమర మంత్రాంగమే
పార్టీల యంత్రాంగమైంది
ఇంటింటి ప్రచారం
వీధి వీధిన
సాంస్కృతిక బృందాల ఆట
అడుగడుగున నేతల ప్రచార బాట
ఇంటింటికి ఓట్ల వేట
రోడ్డెక్కిన రోడ్ షోలు
ఊరించే మ్యానిఫెస్టోలు
ప్రజా స్పందనకోసం
గడప గడపన
అభ్యర్థుల నడక
ఓట్ల కోసం
అభ్యర్థుల వలలు
పార్టీల పగటి కలలు
రెక్కలు కట్టుకు
వాలిన అమాత్య పక్షులు
నీ ఓటు మాకందించే తోడ్పాటు
మా తోడ్పాటు నీ కందించే ఏర్పాటు ....
ఆశల పందిరి నీడన ఓటరు సేద
అయ్యేనా రేపటి కల నిజం ??
ఓటరన్నా!
రేపటి నీ  భవిష్యత్తు నీ ఓటులో వుంది
ఆలోచించు!  అన్వేశించు ! నిర్ణయించు ..!!!
******** అవేరా********
అయుత కవితా యజ్ఞం
25/01/2016
సహస్రకవి101
కవిత నెం:135
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం:దేశభక్తి

శీర్శిక: నా దేశం

పల్లవి :నా దేశం...నా రాజ్యం..
           నన్ను కన్న మాతృభూమి నా ప్రాణం !

      1.ఆనందం..ఆహ్లాదం...
         ప్రేమాభిమానాల బృందావనం ....నాదేశం

       2.సోదరభావం...ప్రేమనినాదం...
           ఉన్నతి కోరే భావనినాదం ........నా దేశం

       3.ఈ తనువూ ... ఈప్రాణం ....
           అణువణువూ...అంకితం.....నాదేశం

       4.మాతృభూమికీ.....భరతజాతికీ...
           చెయ్యెత్తి జైకొట్టు భారతీయుడా ....నా దేశం

       5.నీ మట్టిలో పుట్టిందీ ఈ దేహం...
           నీ గాలితో పోసుకుంది ఈ ప్రాణం.. నాదేశం

       6.నీ నీటితోనె  ఈజీవం...
           నీ ఆకాశం నీడనే బృందావనం.......నాదేశం

       7.ఆ బృందావనమే మాకు స్వర్గమూ...
           నీ పాద సేవే మా పుణ్యమూ................నా దేశం

       8.కులమేదయినా...మతమేదయినా...
           కన్న తల్లి కన్నా కన్న భూమి మిన్న....
           కన్నభూమి మిన్నయని
          ఎలుగెత్తి చాటరా......
          చెయ్యెత్తి  మొక్కరా..... అమ్మ  భారతిని!..........నాదేశం
              *****అ  వే  రా*****
అయుత కవితా యజ్ఞం
26/01/2016.
సహస్రకవి101
కవిత నెం136
కవి: అవుసూరి వేంకటేశ్వర రావు
అంశం: దేశభక్తి
(రైల్లో ప్రయాణం హిజ్రా ఒకరు యాచిస్తూ యధాలాపంగా ఆలపించింది "మా కోసం ప్రాణాలే ఇచ్చావా సైనికా" అని
టాపిక్ అందించి వెళ్ళి పోయింది వెంటనే ఫోన్ తీసి ఆసువుగా అల్లిన కవిత )

శీర్షిక  :అమర వీర!

ఓ వీర సైనికా ..!
భారతీయ యోధుడా ...!
ప్రాణాలే ఇచ్చావా
అమరుడై నిలిచావా?

స్వాతంత్ర్య వీరుల
వీర గాధలిన్నావో
జలియన్ వాలా గాధతో
మనసే రాయయ్యిందో .....?

ఉరికంబమెక్కిన
రాజగురులు ,
ఆజాదులు ,
వీరులే పూనారో ...?
తుపాకికెదురు నిల్చి
కట్టబ్రహ్మనయ్యావో
అల్లూరి వారసుడని
రక్తం ఉప్పంగిందో ....?
మాతృ భూమి
చరిత లోని
సంకెలను మరువలేకున్నావో ...?

అమ్మ గుండె గాయ పరచె
ముష్కర మూకల తరమగ
మొక్కవోని ధైర్యమే
భూషణమై వెలుగగా
ఉత్తుంగ తరంగమై
నిప్పులు చెరిగే సింహమై
దిక్కులు వణకగ
సంహనాద రవమై
ప్రభవించెను నీ వీరము
జగతి జగతి ప్రశంసింప
మాతృదేశ సేవ లోన
వీరమరణమందగా
పూర్వజన్మ సుకృతమే
లోకమెల్ల ప్రణమిల్లగ ...!

ప్రాణాన్నే తృణప్రాయము
అర్పించావమ్మ కోసం ...
అమ్మను కన్న అమ్మ భారతి కోసం...!!
జై జవాన్ అంటూ
చెయ్యెత్తి జైకొడతాం!
శిరసు వంచి ప్రణమిల్లి
ధన్యులమవుతాం....!!!
     *****అ వే రా *****

అయుత కవితా యజ్ఞము
29/01/2016
సహస్రకవి:101
కవిత నెం137
కవి:అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: పర్యావరణం

శీర్షిక:  వృక్షో రక్షతి రక్షితః

పర్యావరణానికై పరితపించే
పది లక్షల గొంతుల కన్నా
పదిమొక్కలు నాటిన చేతులు మిన్న

మొక్కలు నాటిన వాడే మొనగాడు
రేపటి తరానికి మార్గదర్శి
భవిష్యత్తుకు స్వాప్నికుడు

పాదుచేయగ చెమట చుక్కలు
చెట్టుకు నీరైతే కన్నీటి చుక్క కనిపించునా ?

నిజ గాంధేయవాది వృక్షము
రాళ్ళ దెబ్బలకిస్తుంది ఫలం
గొడ్డలి దెబ్బకిస్తుంది కూడు

సర్వరోగ దివ్యౌషద నిలయం
ప్రకృతి ప్రయోగశాల
అడవితల్లి పిలుపు
వినలేరా గడ్డిపూల
గుస...గుస ..

నేలకొరిగిన వృక్షం
నింగికెగసే రోజు
ప్రకృతి నవ్వులు విరబూసేరోజు
పర్యావరణం .....
ప్రాణం పోసుకునేరోజు ..

ఆడంబరాల్లేకుండా
అర శతాబ్దం బ్రతకొచ్చు
అడవే లేకుంటే
అరక్షణం బ్రతుకేది ??

వన్య ప్రాణులను కాపాడండి
వన్యప్రాణి వనాలు
సుందర వనాలు
భవిష్యత్తుకు వరాలు

పచ్చని ప్రకృతి మధుర స్వప్నం
పరి రక్షించకపోతే దుఃస్వప్నం

ప్రకృతి క్షేమం
ఉండదు క్షామం
అదే ప్రజాసంక్షేమం

నిప్పు పెట్టాల్సింది వనాలకు కాదు
నిప్పు పెట్టాలనే ఆలోచనలకు
ఆక్రమించాలనే ఆలోచనలకు
ఎర్రచందనం దొంగలకు
ప్రకృతిసంపద దోపిడీ దారులకు
వన్యప్రాణుల హంతకులకు

నందిని  ఆవును
పూజించే వేదభూమిలో
వన్యప్రాణుల వేటా??
అంతమయ్యే జీవాలెన్నో అక్కటా....!!

ప్రకృతిని పణంగా పెట్టే ప్రతి ఉత్సవం
వినోదం కాదు విషాదం
మానవ భవితకు పాషాణం

అభివృద్ది ఆపలేదు విలయాన్ని
ప్రకృతే ఆపుతుంది ప్రళయాల్ని
మెతుకు పండని భూమి
ఎన్ని ఎకరాలైన నేమి ??
నీటి చుక్కలేని భూమి
ఎన్ని చెక్కలున్ననేమి?

నేడు నీవు నాటే ప్రతి  మొక్క
రేపటి నీటిచుక్క ....!!!
     *****అ వే రా*****

అయుత కవితా యజ్ఞం
30/01/2016
సహస్రకవి 101
కవిత నెం138
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: ప్రకృతి

శీర్షిక: కలలు అలలు *

కలల అలలు కదులును
మనసున వడిగా

నీటి అలలు కదులును
నదిలో సుడిలా

సమీరము అలలు కదులును
ప్రేయసి స్పర్ష లా

నల్లని  అలలు కదులును
ప్రేయసి కురుల సంపదలా

తెల్లనురుగు అలలు కదులును
ఆకాశాన కొంగలగుంపులా

కష్టాల అలలు కదులును
పేదల బ్రతుకులా

సరిగమల అలలు కదులును
చెవి చేరే సంగీతంలా

పచ్చని అలలు కదులును
పంట చేలో తెమ్మరలా

ఆశల అలలు కదులును
నైరాశ్యపు బ్రతుకులా

కలలే అలలై
అలలే వర్తమాన సత్యమై
నిరాశ బ్రతుకుల
వెలుగు కాగడాలవ్వాలి ....!!
   *****అ వే రా *****
అయుత కవితా యజ్ఞం
30/01/2016
సహస్రకవి101
కవిత నెం:139
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: సామాజికం

శీర్షిక: బోర్ *

బోర్...బోర్...బోర్
పిల్లలకు డిస్నీ లేకుంటే
టామ్ లేక జెర్రీలేక
డోరెమన్ లేక
టివి అంటే బోర్

ఇంటిలోని
ఇంతికేమో
సీరియళ్ళు లేకుంటే బోర్

పల్లెటూరు
పూబంతికేమో వాకిట్లో
 ప్రెస్ మీటింగుల్లేకుంటే బోర్

కాలేజి పక్షులకు
క్లాస్ రూమంటే బోర్

కాలేజి పాపలకు
సెల్ఫీ మిస్సయితే బోర్
రోమియోలు లేకుంటే బోర్

కాలేజీ పోరనికి
సెల్లు ఫోనులోన
సొల్లు మెసేజ్ లు లేకుంటే బోర్

స్పందన లేని ప్రియుడితో
ప్రేయసికి బోర్

పత్రిక పాఠకునికి
నచ్చిన టాపిక్ లేకుంటే బోర్

ప్రేక్షకునికి
మసాల లేకుంటే బోర్

ఉపన్యాసకుడికి
శ్రోతలు లేకుంటే బోర్

శ్రోతకు
పసలేని ఉపన్యాసం బోర్

పిల్లలు లేని బడిలో
పంతుళ్ళకు బోర్

సహస్రకవులకు
స్పందన కరువైతే బోర్ !!
    *****అ వే రా *****
అయుత కవితా యజ్ఞం
31/01/2016
సహస్రకవి101
కవిత నెం:140
కవి అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: సామాజికం

* శీర్షిక: మనసు కల్లోలం *
    ( మనసు స్వగతం)
నా స్థానం నాకుంది
నరకాన్నించి స్వర్గానికి
నిచ్చెన వెయ్యగలను
స్వర్గం నుంచి
నరకాన్నీ సృష్టించ గలను
మిల్టన్ మనసున
విరిసిన స్వర్ణాక్షరాలు
కురిసిన కవనామృతాలు
ఎందరి మనసులు తాకాయో?
ఎన్ని మనసులు
నరకం నుంచి
స్వర్గానికి పయనించాయో
మరుగున దాగిన సత్యం ...

నా నగర (మనసు)వీధుల్లో
ఉంటాయి ఉద్వేగాలు
ఇంకొన్ని వీధుల్లో
ఉంటాయి విద్వేషాలు
అదుపులో వుంటే
గతి తీరుగుంటుంది
అదుపు తప్పితే
గతీ మారుతుంటుంది
బాధలు సర్పాలై
చుట్టుముట్టిన వేళ
రక్షించే వారులేక
ఒంటరియై
నిస్పృహ అగాథంలోకి
జారిపోతున్నారు నేటి యువత
నిత్యం నిరాశ .....
నిండా నిస్పృహ .....
మానసిక దౌర్బల్యం ....
కలగలిసి ఆత్మహత్యల దౌర్బాగ్యం ...

ఈ దౌర్బల్య దౌర్భాగ్యాలకు
యూనివర్సిటీలు
విద్యాలయాలు
విలయ నిలయాలై
యువతలో
అరవై శాతం ఆత్మ హత్యలకు
కారణభూతులౌతున్నాయి ...

మానసిక వత్తిళ్ళ
పద్మవ్యూహాల ఉచ్చులో
ఆర్థిక సమస్యల
తిమిరాంధకారంలో
చుట్టుముడుతున్న
వ్యసన వ్యవహాళిలో
స్మార్ట్ ఫోన్ల
కొత్తసమస్యలలో
సమయ సద్వినియోగ లోపం
కరువైన సామాజిక స్పృహ
సమస్యనెదుర్కొనే
మానసిక స్థైర్య లోపం
వెరసి విద్యార్థి కకావికలం

మాకు సమస్యల నుండి
విముక్తి కావాలి ...
జీవితం నుంచి కాదు ...
మానసిక నిపుణుల
కౌన్సిలింగ్ తో
వికసించాలి మాలో
ఆశ
స్పృహ
స్తైర్యం...

విశ్వ వ్యాప్తంగా
ఆలోచించాలి
మేధావులు
ప్రభుత్వాలు
విశ్వవిద్యాలయాలు..!!
   ****అ వే  రా****
అయుత కవితా యజ్ఞం
31/01/2016
సహస్రకవి101
కవితనెం : 141
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: సామాజికం

*శీర్షిక: తిట్టుకుందాం రా!

కోపమొచ్చిన తీరున
మనసున పిండధారణ జరిగి
నోరనే గర్భాన్నుద్భవించి
ప్రసవమవ్వు తిట్టు

తిట్టు
క్షణికావేశంలో పుట్టు
నష్టాన్ని కనిపెట్టి
పశ్చాత్తాపమై సరిపెట్టు

ప్రేమకు
సాన్నిహిత్యానికి
తిట్టు
తిరకాసులేని పట్టు
ప్రేమాభిమానాల తేనెపట్టు...

తిట్టు
వినాయక చవితి నాడు
దీవెనై మొప్పు
ఆనాడు మాత్రం
నన్ను పిచ్చపిచ్చగా తిట్టు ....
    ****అ వే రా ******

అయుత కవితా యజ్ఞం
శుక్రవారం జనవరి 29/2016 రాత్రి మరణించారు
ఆ సందర్భంలో రాసిన కవిత
31/01/2016
సహస్రకవి:101
కవిత నెం142
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: నివాళి
*శీర్శిక: శ్రీమతి నాయని కృష్ణ కుమారి

ప్రజ్ఞా పాటవాల
స్వయం ప్రకాశం మీరు
పరిశోధనల దీపాంకురం మీరు
1930 మార్చి 30 సుదినాన
చారిత్రక గుంటూరు నగరాన
అవనిన పుట్టిన వెలుగు చుక్క మీరు
భావ కవితల రేడు పితృదేవులు
సుబ్బారావు సూరీడు
వెలుగులను పుణికి పుచ్చుకున్నారు
మీ భాషాసాహిత్య సేవలు
తెలుగుతల్లికి పాదసేవలు
" జానపద గేయ గాథలు' పై
పరిశోథన తో "డాక్టర్" అయ్యారు
జానపద విజ్ఞానరంగాన మమేకమయ్యారు
ఆచార్యులుగా
శాఖాధిపతి రాలిగా
మూడు పదుల యేండ్లు
ఆచార్య సేవలందించి
ఆచార్యులకే తలమానికమయ్యారు

పువ్వు పుట్టగనే పరిమళించునట్లు
పద్దెనిమిదేళ్ళ వయసునే
"ఆంధ్రుల కథ" గ్రంధ రచన
ఆ పైన ...
" కాశ్మీర దీప కళిక"
"కథలు గాధలు"
" కథా సరిత్సాగత కథ"
"మెకంజీ కైఫీయతులు"
"ఉయ్యాల పాటలు"
"తెలుగు భాషా చరిత్ర"
"తెలుగు జానపద గేయగాథలు"
" తెలుగు జానపద విజ్ఞానం"
గ్రంథాల రచనలు
తెలుగు సాహితీ
లోకానికి వెలుగు దివ్వెలు ...
ప్రతిగా...
మీకు అందిచినది
దీవించి తెలుగు మాత ...
"గృహలక్ష్మీ"
"స్వర్ణకంకణం"
"ఆంధ్ర సాహిత్య అకాడమీ "
"తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ కవయిత్రి"
పురస్కారాలు..
మీ ప్రతిభా పాటవాలకు కిరీటాలు
సాహితీ వికాసానికి ....
ఎనలేని సేవలు మీవి
ఎన్నదగిన ప్రతిభ మీది
మరణం లేని అమరజీవిగా
వెలుగుతున్నారు
తెలుగు సాహితీ వనాన
అమరజీవిగా
అందుకో మాతా
మా హార్దిక నివాళి...!!
  ****అవేరా****
కవిత అయుత యజ్ఞం
01/02/2016
సహస్రకవి101
కవిత నెం: 143
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: ప్రేమ

శీర్షిక: 143

143
ఐ లవ్ యూ
111
I L  U
ఇలు
ప్రేమంటే
అక్షరాల అంకెలా ?
అల్ఫాబెట్ల లెక్కలా?
తెలివి మీదేనని
పరిధి మీరెనని
తెలిసేలోపే
అయస్కాంత క్షేత్రాన
భందీలవుతారు
ప్రేమ రోగులవుతారు
జీవిత లక్ష్యాలన్నీ మూలన పడతాయి
మనసు నిలువనంటది
సొగసు దోచమంటది
కాలేజీ బ్యాగు లగేజీకి
తోడుండాలి  జతగాడు
ప్రిస్టేజ్ సింబల్  మరి
బైక్ ప్రియుడు మిడిల్ క్లాస్
కారు ప్రియుడు హైక్లాస్
బెంజి అయిన బంపరే మరి
అబ్బాయిల పాకెట్ మనీ
అవుతుంది...
అమ్మాయిల మేకప్ మనీ
తల్లి తండ్రుల కాయకష్టం
కరిగే జల్సానష్టం
కరిగే విలువైన కాల నష్టం
ఇది ప్రేమా ?
ఆకర్షణా?
మోహమా?
విరహమా?
నిర్వచనం తెలిసే లోగా
చివరి లైనులో నీవు
పట్టాలు తప్పిన జీవన రైలు...!
పక్వానికి రాని పండు
పక్వానికి రాని ప్రేమ వగరే కదా ?
    *****అ వే రా ******
143 గురించి గుర్తు చేసిన వీరారెడ్డి గారికి బహు"మతి"
అయుత కవితాయజ్ఞం
శనివారం 30జనవరి2016 నాడు మరణించిన
సందర్భంగా
సహస్రకవి101
కవిత నెం 144
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : నివాళి

శీర్షిక: జనరల్ కృష్ణారావు

తెలుగు తల్లి కాంతి కిరణం
భరత మాత ముద్దు బిడ్డ
జనరల్ కోటికలపూడి వేంకట కృష్ణారావు గా
కెయస్ నారాయణరావు
లక్ష్మీరావు పుణ్య దంపతుల ముద్దు
బిడ్డగా 1923 జులై 16న
విజయవాడ పుణ్య నగరాన
ప్రతిభకు ప్రతినిథిగా జన్మించారు ...

పంతొమ్మిదేళ్ళ చిరు ప్రాయంలో
సైన్యంలో దూకిన ధీశాలి
1947-48 పాకిస్తాన్ తో
యుద్ధంలో మీ వీరోచిత
పోరు గాధ రోమాంచితము
1971బంగ్లా విమోచన
పోరాటాన మీ క్రియాశీలకత
మీ విజ్ఞతకు మచ్చుతనకై నిలిచెగా
నాగాలాండ్
మణిపూర్  లలో
పెచ్చురిల్లిన
ఉగ్రవాద పీచమణచిన
"మౌంటెన్ డివిజన్"
నేతృత్వ నేపథ్యం
మరువగ లేని మాతృ దేశ సేవ ...

1971 భారత్- పాక్
యుద్ధంలో తిరుగులేని
నాయకత్వం
ధైర్య సాహసాలు
అంకిత భావం
గజ గజ లాడించాయి
శతృ మూకలను
పరమ విశిష్ట సేవా పథకము
మీ పరమ సేవలకు చిరు పురస్కారమే ..

అనుక్షణం దేశ మాత సేవలో
పునీతమైనారు
నాగా లాండ్
త్రిపుర
మణిపూర్
మిజోరం
గవర్నర్ గా
మీ విశిష్ట సేవలు మరువలేనివి
జమ్ముకాశ్మీర్ గవర్నర్ గా
ఉగ్రవాద పతాక స్థాయిలో
శాంతిస్థాపన చేసి
ప్రజా స్వామ్యనికి ఊపిరిలూదారు ...

కడుపు కోత
కఠిన దుఃఖం
అనుభవించ
కన్న తల్లి లేకున్నా
మాతృమూర్తి భరతమాతకు
ముద్దుబిడ్డగా
కడుపుకోతను
మీరు లేని లోటును
తీర్చగలమా ....
భారతావని ముద్దుబిడ్డగా
ఉషా కిరణమై అవని చేరి
సంధ్యా కిరణమై అస్తమించి
వినీల ఆకాశాన నక్షత్రమైనారా...!!

అందుకోండి ...
మా హార్దిక నివాళులు
ముకుళిత హస్తాలతో ...!!
    ****అ వే రా ****

అయుత కవితా యజ్ఞం
01/02/2016
సహస్రకవి101
కవిత నెం145
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: ప్రకృతి
శీర్షిక: తేనె ఎంత మధురం

అలుపులేని ప్రయాణం
కొన్ని వందల మైళ్ళ యానం
పువ్వుల కోసం అన్వేషణ
ప్రతి పువ్వు ఒక మధుపాత్ర
పుక్కిట చిక్కిన తేనె పుప్పొడితో కూడి
ఆకుచాటు కొమ్మకి
గదుల భవంతి నిర్మించి
రేపటి ఆకలి అవసరాలకు
పొదుపు చేసుకుంటుంది
గడుసరి మధుపం
గుట్టుగా చాటుగా
నిర్మించిన భవంతిని
మనిషి కొల్లగొట్టి
మధుపం శ్రమను దోపిడీకి
పాల్పడుతున్నాడు
వేలాది పూవుల
పుప్పొడి మకరందాల
కలయిక కమ్మని తేనై
సుపరిమళ
సుమధుర
దివ్యౌషద
భూలోక
అమృతమైంది .....

తేనెటీగల పెంపకం
పరిశ్రమగా వికసించింది
పంచరంగుల తేనెలు
వింత రుచుల తేనెలు
పూదోటలయుక్తంగా
 తేనెల తోటలు
రకరకాల తేనెలు
ఆయుర్వేదంలో
అద్భుత ఔషధం
వాడితే
వాడదు దేహం
ఉండదు హృద్రోగం
బరువెక్కిన దేహాలు
బడలికతో వడలినపుడు
ఊబకాయ నిర్మూలన
తేనే కదా ఫార్ములా
ముడితేనే మచ్చటైనది
రక్త పోటుకు పోటు
యాంటి సెప్టిక్
యాంటి ఫంగల్
యాంటీ బాక్టీరియల్
గాయాలేమున్నా
గాయబ్ తేనున్న
మచ్చలు మటుమాయం
తేనెపూత రాతలతో
ఎలర్జీలుకడుదూరం

సౌందర్య లేపనం
సాటిలేనిమధురసం
చర్మసౌందర్యం
పునరుజ్జీవం
కవులందరి భావనలో
తీపికి నిర్వచనం
తేనై విలసిల్లు
తేనెమనసులై
తేనెపలుకులై
తేనెలూరే పెదవియై
కమ్మనైన తీయదనానికి
తేనెకు తేనే సాటి
మరి లేదు పోటీ.....!
    *****అ వే రా *****
అయుత కవితా యజ్ఞం
29 జనవరి శుక్రవారము సాహితీ  వృక్షము
నాయని కృష్ణకుమారి గారు కూలి పోయిన
సందర్భంగా...
1/02/2016
సహస్రకవి:101
కవిత సంఖ్య146
కవి అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు cell 7207289424
అంశం :శ్రద్దాంజలి

శీర్షిక : నాయని కృష్ణకుమారి

"నీ కవిత్వమంతటా
నమ్మకం ...
అక్షరమై మెరుస్తుంది "
కవిలోకానికి అందించిన కమ్మని
మాటకు నీ కవితే ప్రతీక
నీ మాటకు నీవే నమ్మకమై నిలిచావు
నాయని సుబ్బారావు
హనుమాయమ్మ
దంపతుల గారాలపట్టిగా
14మార్చి1930 నాడు
గుంటూరు నగరాన
వికసించిన సాహితీ కుసుమం నీవు
పద్దెనిమిదో ఏటనే
కలం దూసి కవన మల్లిన
కరము నీది
తెలుగు భాషాప్రక్రియల్లో
నిరంతర కృషి
మేధాసంపత్తి
పరిశోధన
సాహిత్యభోధన
కవిత్వ రచనల
ప్రతిభ అనితర సాధ్యం
విశిష్ట సామాజిక దృష్టికి
నీ కవితే దర్పణం
ఆశావాదానికే ఆశలు రేపును
మూఢాచారాలను మూలకు తోసేను
అంధవిశ్వాసాలకే గంతలు తొడిగేను
వివాదాల జోలు లేదు
సంచలనాల జోరు లేదు
కావవి నీ కవితాలంబనాలు
" ఇజం" మత్తు జల్ల లేదు
ఆశ ఒక పేట
మనవత మరొక్కటి
మమతల ముప్పేట
ముచ్చట గొలిపిన కవిత
శాంతి వెలగుచుండును
నీ వ్యక్తిత్వంలో
శాంతి తొణుకు చుండు
నీ కవిత్వంలో
"అగ్నిపుత్రి" ఒక తేనె పట్టు
కురిసింది అమృతధారలు
కన్న తండ్రికి పితృదక్షణగా

వేరు కాదు నేను
వేరుకాదు లోకం
నేనునూ లోకంలో
సమిష్టమేనను భావన
కవితా వస్తువు దీవెన ....

గతాన్ని ప్రేమిస్తూ
వర్తమానాన్ని విస్మరించే
పిచ్చి కవిత్వం కాదని
నిరాశా
నిస్పృహలను
తరిమి కొట్టి
భవిశ్య దర్శనం
చేయించే కవితే నీదని చాటావు

మార్పును ఆహ్వానించు !
మార్పు కోసం
ఉగ్రవిప్లవాల్ని ఆహ్వానించవద్దని
ప్రశాంత విప్లవాలనాహ్వానించిన
శాంతి దూతవు

"నా కవిత్వం..నన్ను లెంపకాయ
కొట్టే కోపదారి తల్లి లాగే
కొరకొర చూస్తుంది"
అన్న మాటలు నీ
అంకిత భావానికి అద్దం పడతాయి
భావనలో బంగారం
వ్యక్తీ కరణలో మొక్కవోని దీక్ష
నిరంకుశతలు
వెరసి
నీ కవిత
ఆలోచనామృతం
"నా జాతి చరిత్రలో నెగళ్ళు లేవు
ఈర్ష్యలనే గళ్ళు లేవు
నాజాతి మనస్సులో పొరలు లేవు
ఆ ఆంతర్యంలోపల మకిలితనపు అడ్డుతెరలు లేవు
తెలుగు నేల వెలుగు నేలగా తళతళలాడిన చోట
అంతా చల్లని ఒడి
ఇది అమ్మ ఒడి "
అన్న అమృత వ్యాక్యలు
చెవిన రింగుమంటున్నాయి ..
నీ"  కాశ్మీర దీప కళిక"
తెలుగు సాహిత్యపు అమృత గుళిక

"గృహలక్ష్మి" స్వర్ణకంకణం
అసోచమ్ "దశాబ్ద మహిళ "పురస్కారం
సాహిత్య అకాడమీ
తెలుగు విశ్వ విద్యాలయాల
పురస్కారాలు
నీ విజయ కీర్తి కిరీటాలు
"కాలాన్ని నెచ్చెలిగానే తప్ప
శతృవుగా చూడలేనన్నావు
కాలము ఆగదని
దేహము శిధిలమవునని
శాశ్వతము కాదని చెప్పకనే చెప్పావు
కనుమరుగై పోయావు
కవితా ప్రపంచానికి వేగు చుక్కవైనావు
నీవు మా మద్యన లేక పోయినా
నీ సాహితీ స్ఫూర్తి ప్రతి యువ కవి/కవయిత్రులకు
నిత్య స్ఫూర్తిగ నిలుస్తుంది అమరమై
  ******అ వే రా ******
అయుత కవితా యజ్ఞం
04/02/2016
సహస్రకవి 101
కవితనెం :147
కవి:అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: రాజకీయం

శీర్షిక: రాజకీయ వైరాగ్యం

పోనీ పోనీ పోతే పోనీ
ఓటరుల్ పదవుల్  పీఠముల్
పోతే పోనీ ......!

పోనీ పోనీ పోతే పోనీ
చుట్టాల్ పక్కాల్ చెల్లెల్ అక్కల్
పోతేపోనీ అన్నల్ తమ్ముల్
పోతేపోనీ .......!

పోనీ పోనీ పోతే పోనీ
కొడుకుల్ కోడల్ కూతుర్ పెండ్లాం
పోతే పోనీ .........!

రానీ రానీ వస్తే రానీ
స్కాముల్ గీముల్ కేసుల్
వస్తే రానీ........!

రానీ రానీ వస్తే రానీ
దెబ్బల్  బొబ్బల్ తిప్పల్ రానీ.....!

రానీ రానీ వస్తే రానీ .....!
బి పి  సుగరు రోగాల్ రానీ....!
(శ్రీ శ్రీ గారి పోతే పోనీ కవితకు పేరడీ )
   *****అవేరా******
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
4/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:148
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రకృతి
శీర్షిక: అడవి

కొండలు గుట్టలు
ఎత్తూ పల్లం
నెరళ్ళు
వాగులు
వంకలు
నదీ
నదాలూ
దుంపల వేటలో
అడవి పందులూ
తుళ్ళే జింకలు
తరిమే పులులూ
ఉరిమే తోడేళ్ళు
ఎంగిలి కోసం
గుంటనక్కలూ
ఉరుకులు పరుగులు
అలసే హరిణిలు
కొరికే చలిలో
ఉరికే దుప్పులు
పచ్చిక మేసే
అడవిదున్నలు
అలములు
ఫలములు
ఔషధములు
వేర్లూ
ఏర్లూ
పశువుల పచ్చిక
గడ్డి పూవులూ
పరాగపూవులు
పగడపు మెరుపుల
మోదుగ పూవులు
తేనెటీగలూ
తేనెతుట్టెలూ
చెట్టు నీడన
కిలకిల పక్షులు
రంగు రంగుల
చకోర పక్షులు
బెరళ్ళు
నీడన
పురుగుల పుట్టలు
నెమళ్ళ ఆటలు
కోయిల పాటలు
వేటకు వచ్చే
వడ్రంగి పిట్టలు
పురుగుల వేటన
కౌజులు కల కల
నీటి కుంటలో
కొంగల ఆటలు
అండగ నిలువక
తుంచెదవేలా
మూగజీవులా
బృందవనమును
కవులకు అందని అందాలెన్నో ?
పుడమిన కులికిన సోయగమెంతో?

      *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
4/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:149
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: కారుమబ్బులు

స్వతంత్ర్య భారతావనిన
స్వేచ్ఛా విహంగమై
ఎగరాలనుకున్నాను
చీకటినిండినదేమని
పరికించి చూడగా
ఆకాశాన కారు మబ్బులు
మబ్బులా కావవి
మానవతకు మురుగు గబ్బులు
ఒకచో మత మౌఢ్యపు మబ్బు తునక
ఒకచో కుల గజ్జి గబ్బు మబ్బు
ప్రజా రాజ్యమను గంతల మాటు
నియంతల పాలన మబ్బు
ఒకచో ప్రాంతీయ కార్చిచ్చు మబ్బు
ఒకచో రాజ్యాంగానికి చెదల కాట్లు మబ్బు
ఒకచో అవినీతి మబ్బు
ఒకచో కుళ్ళు రాజకీయ మబ్బు
ఈ మబ్బుల తలక్రిందుగా
వేళ్ళాడుతున్నవి
చిమ్మిన చీకటిన
గబ్బిలాల వలె
సమైఖ్యత
సోదర భావం
జాతీయ భావం
అభివృద్ధి..!

  *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
04/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:150
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: స్వాతంత్ర్యం

దశాబ్ధాల స్వాతంత్ర్యం
దిశమొలతో నున్నది
సిగ్గు బిళ్ళ కరువై
బిక్క చచ్చి వున్నది
దశదిశలా అభివృద్దే
దశవిధాల అభివృద్ధే
మాటలు కోటలు దాటును
లెక్కలు రాకెట్ల తోకలతాకును
అభివృద్ది యాడున్నది?
ఎమ్ పీ జీతంలోనా ?
ఎమ్  ఎల్  ఏ "గీతం" లోనా?
అభివృద్ధి అనగ
బీసీ ఓసీ గ మారు
ఓసీ బీసీ అయిన
పురోభివృద్దా తిరోగమనమా?
ఉత్పత్తి పెరుగుటే కాని
వ్యవసాయం తరుగుట లేదా
పరిశ్రమలు పెరిగెను గాని
కాలష్యమూ పెరిగెనుగా?
పర్యావరణము తరిగెనుగా?
అవును అభివృద్ధి జరిగింది
అదుపు లేని జనాభాలో
మనవ విలువల పతనంలో
కులమత విధ్వేశాలలో
రాజకీయ కుంబకోణాలలో
అవినీతి స్కామ్ లలో
కన్నీటి బ్రతుకుల లెక్కల్లో
రైతుల ఆత్మ హత్యల్లో
అత్యాచార లెక్కల్లో
చదువుల ఫీజుల్లో
వైద్యం ఖర్చుల్లో
అబలల అమ్మకాల్లో
చదువుల పతనంలో.....
భారతావని
భారమైన మనసును
తేలిక పరచండీ
నవ స్వాతంత్ర్యానికి
నాంది పలకండీ

*****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
4/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:151
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రేమ

శీర్శిక: భగ్న ప్రేమ *

ప్రియా!
నా అంతరంగ మధనంలో
హృదయ వేదన
నీ మసక జ్ఞాపకాల
దొంతర్ల రోదన
ఊహల జాడ లేదు
రెక్కలొచ్చి ఎగిరినవో ?
కాలంలో కలిసినవో ?
నీ అందని చేతికై అన్వేషణ
నీ కన్నుల కాటుక చాటున
కన్నీటి చారులు
మరువ లేని పిడి బాకులు
నీ కురు వింజామర
విసిరిన విరి పరిమళం
నాసికనంటిన గులాబీ అత్తరు
నను సుతారంగా స్పృషించిన
సమీరమై పరవశమై
మరువ లేని జ్ఞాపకమై
నా జ్ఞాపకాల ఆకసాన
నక్షత్రమైనావా?

   *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
5/02/2016
సహస్రకవి 101
పద్య కవిత సంఖ్య:152
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : గ్రేటర్ ఎన్నికలు
శీర్శిక: మేయర్ ఎవరు?

జోరు జోరుగ
ఎవరు ఎవరని
నెలకొంది ఆసక్తి
గద్దెను
పంచుకొనుట
కుర్చీలాట ....

అవగాహన
ఆలోచనలు ....
కలసి వచ్చే వారి కోసం
తలుపులు బార్లా ...

అర్థం కాని లెక్కలు
అర్థం కాని ఓటరు నాడి
కులాలవారీ
మతాలవారీ
బస్తీలవారీ
విశ్లేషణలు ....

ఊహల కలల్లో
అభ్యర్థులు
అయోమయంలో
అనుచర గణాలు
ఈ వి ఎమ్ లో
దాగిన అభ్యర్థుల
భవిత .....

అంచెల
భద్రతలో
ఈవిఎమ్ లు
భద్రం...
భద్రతా వలయంలో
భద్రతా సిబ్బంది
సిద్దం ...

రానున్నవి లెక్కింపు
గణాంకాలు
తేలనున్నది
అభ్యర్థుల భవితవ్యం ....

ఉత్కంఠగ
చిన్నతెరకు
అతుక్కుందురందరూ
పిలిచినాా పలుకరు
అరచినా  ఉలకరు ....
వేచి చూద్దాం ..
మనం ....
ఎటు వేసారో
ఓట్లు జనం ...!!
*****అవేరా*****

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
5/02/2016
సహస్రకవి 101
పద్య కవిత సంఖ్య:153
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: చీకటి-వెలుగు

ఆదరణ కరువైన
అంధుల జీవితం
కళ్ళలో వెలుగు
లేకున్నా
కన్నీటి కడలి
నిక్షిప్తం ....

వేదన చీకటి మనసున
వేకువ కలిగింప
విజయానికి ప్రేరణ
కృషికి ఆదరణ
అందించే
అందమైన
బృందావనం
ఇవిదా .....
(IVIDA)
ఎన్నో చిలుకలకు
పాటలు నేర్పింది
ఎన్నో కళలను
అంధ విద్యార్థులకు
నేర్పుతుంది....

చీకటి- బతుకులలో
గీతావళి ని
వెలుగు దీపావళి గా
వెలుగులు నింపుతుంది
మౌనంగా ఎదిగే మొక్కలకు
ఎదిగిన కొద్దీ ఒదిగే మొక్కలకూ
బృందావనమైంది ......

కంటిచూపు లేకున్నా
డ్రమ్ములు రఫ్ఫాడిస్తారు
గాత్రంతో సరిగమలు పలికిస్తారు
శ్వాసలతో వేణువులో
నాదం పలికిస్తారు
కీబోర్డులు వాయిస్తారు .....

నిరాశ
నిర్లిప్తత
నైరాశ్యం
వైరాగ్యం
గతం ......
ఆత్మవిశ్వాసం
ధైర్యం
కళా ప్రదర్శనలే
నేటి ఆలంబనం
*****అవేరా*****
IVIDA(Institute for Visually Impaired and Deferently Abled)

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
5/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:154
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : రక్షణ
శీర్శిక: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
(విశాఖ పట్టణం)

ఉత్సాహం ఉరకలేసే
విశాఖ నగరం
సాగరతీరం
సంధ్యాసమయం
విరిసిన సౌందర్యరేఖ ...
విదేశీ వనితల సాహసం
గగన విన్యాసం
కనువిందు
కవాతులో
నౌకాదళ శకటాలు
సంప్రదాయ వేషాలు
సాంస్కృతిక ప్రదర్శనలు
చేతక్ కాప్టర్లతో భారత
నౌకాదళ సాహస
విన్యాసాలు
స్వీడన్ బైప్లేన్లతో
స్కాండినేవియన్ల వింగ్ వాక్స్
ఏరోబాటిక్స్
రోమాంచిత విన్యాసాలు
ఎగిరే విమానం పై
మహిళల విన్యాసాలు
ఊపిరిసలపని
ఉత్కంఠ
బైప్లేన్లు త్రివర్ణ
పొగతో ఏరోబిక్స్
రంగుల సంబరమే
అంబరాన
అబ్బురమే
జెట్ విమానాల
టెయిల్ ఛేజింగులు
పైలట్ల సాహస విన్యాసాలు
నిఘూ విమానాలు
పి8ఐ
హాక్స్
కమోవ్స్
వీక్షకుల పై
మంత్రం చల్లాయి
మెరైన్కమెండోలు
నింగిలో చుక్కలైనారు
ఆపైన
వివిధ దేశాల నేవీ
దళాల కవాతు
కన్నులకు పండుగే
రంగురంగుల
శకటాలు
మేకిన్ ఇండియా సింహం
వైజాగ్ స్మార్ట్ సిటీ
కనువిందుచేశాయి
రంగురంగుల జువ్వల కాంతులు
విద్యుద్దీపాల విందులో
నౌకల కనువిందు
కిక్కిరిసిన జనానికి
కిక్కిచ్చిన సంబరాలు...!
    ****అ వే రా*****


అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
5/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:155
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: రాబందు

రాళ్ళ గుట్టలు
అడవులు
రాబందుల నెలవులు
పొడుగుముక్కు
పసుపుముక్కురాబందులు
ఉనికి లేని పక్షి
అంతరించెననిరి
కానీ
రాబందులకు నెలవైనది
తెలంగాణ
బిజ్జూరు అటవీ రేంజ్ లో
26 రాబందుల   లెక్క
అంతరించ లేదను
శుభవార్త...!!

మృతకళేబరాలే ఆహారము
ఆకలెక్కువ
బలము ఏక్కువ
జనమునకు హాని చేయని
ప్రకృతి ఒడిలోని పక్షి
జనాన్ని
బ్రతికుండగానే
పీక్కుతినే
మనుషులకు
సరియగునా
రాబందు పిలుపు
సిగ్గున చావదా
పాపం రాబందు...!!

   *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
5/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:156
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రేమ
శీర్శిక: జల్లులు

చల్లని వెన్నెల తాకగ
వికసించెను కలువలు
నీ చల్లని చూపును
తాకిన నా కనులే
వెన్నెల కురియును ......

నాలోని అణువణువూ
తడిమే నీ చూూపు
మదిలో అలజడి రేపు ..

కురిసిన మంచులోన
స్నానమాడి
ప్రకృతి కాంత
కొత్త కాంతి
సొబగులతో
మెరిసెను
ప్రత్యూష కిరణాల
కొత్తవెలుగులో .....

నడి రాతిరి
సడి చేయక
కురసిన నీ ప్రేమ జల్లున
తడిసిన నా మేను వోలె...!!
   *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
5/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:157
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రకృతి
శీర్శిక: స్వార్థం

మాటలు రాని నేస్తాలు
స్వార్థం లేని నేస్తాలు ...

కారు మబ్బు నుండి
జాలు వారిన వాన చినుకుకు
తెలియదా తగిలే చురక
అయినా వెరవక దూకును
పుడమిని చేర .....

దుక్కి దున్ని
పెంచిన నారుకు
తెలియదా తన బతుకు
తనకోసం కాదని .....

నారు పైరైనపుడు
మొక్కకు తెలియదా
తనకు మిగిలేదేమీ లేదని ....

పూచే ప్రతి పువ్వుకు  తెలియదా
జీవితమే క్షణికమని .....
తన పరిమళం పరులకని ....

తొడిగే ప్రతి చిగురుకి తెలుసు
ఆకులా రాలక తప్పదని ....

కాచే తరువుకు తెలియదా
ఫలములు తనకోసం కాదని ....

వెలుగు పంచే దీపానికీ తెలుసు
ఆ వెలుగు పరులకేనని....
తన బ్రతుకు చమురు న్నంత వరకేనని ....

మనిషి జీవితంలో
తమకేమీ ఇవ్వక పోయినా
ప్రతి ఫలమాశించని త్యాగ జీవులు ....

ప్రతి ఆలోచన స్వార్థమై
ప్రతి పనిలో స్వార్థమై
మూడు నాళ్ళ బతుకులో
నీవెవరికి ఏమిచ్చావు ??
కష్టం నష్టం తప్ప ...

పరుల కోసం చురకలెన్ని తిన్నావు ?
పరుల కోసం చిగురులెన్ని తొడిగావు ?
పరుల కోసం పూవులెన్ని పూచావు ?
ప రులకోసం   ఫలములెన్ని పంచావు ?
దీపమై వెలుగు నింపావా ?
ఎవరి జీవితంలో నయినా ?

మూడునాళ్ళ ముచ్చట
జీవితం....
మూడు తరాల ఆలోచన నీకెందుకు ?
మాటలు రాని నేస్తాలే
ఇంత మేలు చేస్తే
మాట ,మేధ ఉన్న నీవెంత చేయొచ్చు ?
స్వార్థం మత్తు వీడి
జూలు విదిల్చి కదులు
నీలోని చమురు(ఆయువు) ఉన్నపుడే
నీ చుట్టూ ఉన్న తిమిరాన్ని
తరిమే వెలుగువై
దివ్య జ్యోతివై....!!

****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
5/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:158
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: బాలికల హత్యలు

**4/02/2016 నాడు అదిలాబాద్ జిల్లా కుశ్న పల్లి లో
అదనపు కట్నం కోసం 3ఏళ్ళకూతురు
హత్య(యదార్థ సంఘటన )**

 నాన్నా!
అమ్మ కడుపు వెచ్చదనం
అమ్మ ఒడిలో ఆప్యాయతలనొదిలి
నీ మనసు చల్లదనం
నీ ప్రేమ కమ్మదనం ఆస్వాదించాను
భ్రూణ హత్య గండం
గడిచిందని సంబర పడ్డాను
పురిటి హత్య గండం
రానందుకు ఆనందించాను
దేవతలాంటి అమ్మఒడిలో
సేద తీరాను
గోరుముద్దలలో
ప్రేమామృతాన్నీ
అందుకున్నాను
నీ గుండెలపై చేరి
ఆడుకున్నాను
నా కేరింతల సందడిని
నా గుండెల ఆనంద సవ్వడినీ
ఆస్వాదించలేక పోయావా
ఆనందిచలేక పోయావా నాన్నా!

ఈ రోజు బిస్కత్తులు
చాక్లెట్లూ ఇస్తుంటే
ప్రేమను పంచుతున్నావనుకున్నాను
కపటమెరుగని నేను
నీ కపటమెలా గ్రహించను
చేయి పట్టి నడిపిస్తుంటే
వెలుగు వైపు అనుకున్నాను
చీకటి అగాథంలోకి తోసావు
ప్రయాణంలో నా
కేరింతలు నీకానందం
ఇవ్వలేదా
అప్పుడైనా
నిన్ను నీవు ప్రశ్నించుకో లేదా
నీ కపటపు ఆలోచన
వికటమయ్యేలాగా ....

భుజానికి నన్నెత్తుకున్నప్పుడు
నన్ను భాద్యతగా ఎత్తుకున్నావనుకున్నా
బావిలో వేసావు !
పిల్లలను మించిన
ఆస్తులు ఎక్కడైనా
వున్నవా నాన్నా?
వుంటాయో పోతాయో తెలియని
ఆస్తులు సంపద కోసం
అమరమైన ప్రేమలను
చంపేసావా?
అమ్మ మనసును
హింసతో హత్య చేసావు
నన్ను హత్య చేసి
నీవు జైలుకెళ్ళి
అమ్మను ఒంటరిని చేసావు
జీవచ్చవాన్ని చేసావు
అమ్మనూ హత్య చేసావు !

  *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
6/02/2016
సహస్రకవి 101
పద్య కవిత సంఖ్య:159
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం

శీర్శిక: బీడైన పల్లె

పడుతూ లేస్తూ
పయనమైనది
పల్లె....పట్నం వైపు ...

కూడులేక  కుడితిలేక
బక్కచిక్కి పశువులు
పడుతూ లేస్తూ
 పయనమైనవి
పట్నానికి...కబేళాకు ....

నీరు లేక
గడ్డి లేక
పచ్చిక లేక
డొక్కలెండి
రెక్క క్రుంగి
మేకలు గొర్రెలు ,బర్రెలు
రంగులలో మునకేస్తూ
పడుతూ లేస్తూ
పయనమైనవి
పట్నం కబేళాకు ...

కూలిలేక
కూడులేక
గూడు ను
గుడ్డలు లేక
బక్కచిక్కి
చేవ చచ్చి
కూలన్న ...
ఆలు బిడ్డ
మూట ముల్లె లతో
కదిలెను పట్నం వైపు...

వాన లేక
నీరు లేక
పంట లేక
అప్పు రాక
భూములొదిలి
ఇంటి నొదిలి
కన్న తల్లి
ఊరునొదలి
పట్నం కదిలెను రైతు ...

ఉద్యోగం వేటలోన
బ్రతుకు తెరవు బాటలోన
అలసి సొలసిన యువత
ఉన్నదంత అమ్మకుని
పట్నాన్నే నమ్ముకుని
కదిలింది దండులా పట్నం వైపు...

పల్లె తల్లి
తల్లడిల్లి
తిరిగి చూడ
మరలి చూడ
ఊరంతా
బీడాయే
మసల మనిషి లేక ...
కనగ పంట లేక....
కాంచ పశువు లేక ....
చూడ చెట్టు లేక......
ఒంటరియై ఉండలేక
వెంటనె కదిలెను పల్లె... పట్నం వైపు .

    *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
6/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:160
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: పల్లే కదా స్వర్గ సీమ

స్వర్గంలో వున్నవన్ని
పల్లెలలో వున్నవి
పల్లెలలో వున్నవన్ని
స్వర్గం లో వున్నవా?...

పల్లె ....
అందాల హరివిల్లు
పచ్చని పంట పొలాలే
మఖమల్ పచ్చ తివాచీ ...

అరవిచ్చిన పొద్దుతిరుగుడు తోట
పసుపు జలతారు

విరిసిన మల్లె తోటలు
పోసిన ముత్యాల రాసులు

విరబూసిన మందారాలు
పల్లెకు సొగసు పారాణి

గుభాళించు గులాబీ తోట
రాశిగ  పోసిన పగడాల మూట

పారిజాతాలను తలదన్నే
సంపెంగ
మొగలి
గులాబీ
విరజాజి
సన్నజాజులు
బొడ్డుమల్లెలు
రాత్రి రాణీలు

కల్మషం లేని మనుషులే
దేవతలు ....

ఏరు వాకన
ఏటి గట్టున
జనపదాలే
ఇంద్ర సభ సంగీతం ...

అమ్మా....
నాన్నా...
బాబాయ్...
పిన్నీ....
వదినా...
అన్నా....
తమ్మీ....
అక్కా...
చెల్లీ....
ఆప్యాయ పలకరింపులో
మనసులో ఎన్ని పులకరింతలో

స్వర్గంలోనూ
అందుబాటున
లేనివి ఈ
పలకరింపులూ
పులకరింతలూ

      *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
07/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:161
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం :విద్య
శీర్శిక: నైపుణ్యం

ఎంత చెట్టుకంతగాలి
ఎంతచదువుకంత ఉద్యోగం
నిజం ఆనాటి మాటలివి
మరి ఈనాడు...??
చదువు బారెడున్నా
జానెడు ఉద్యోగం సున్నా!

ఇంటర్ తో సరియన్నా
బారులు తీరుతున్న
డిగ్రీలు ,పీజీలు
కానిస్టేబుల్ కొలువులకు
పట్టభద్రులు
ఎంటెక్
ఎంఫార్మ్
ఎంఫిల్
పీహెచ్ డీ
కుప్పలు
తెప్పలు
అప్లికేషన్లు ....

ఆలోచించారా ?
విశ్లేషించారా?
ఉదంతాల
ఉద్దేశ్యమేమిటో?
చదువులు ఎండమావులవుతున్నాయి
పట్టాలున్నా " పట్టు "లేని చదువులు
పట్టున్న వారికై వెతికి వేసారే సంస్థలొకవైపు ....
నాణ్యత కొరవడిన పట్టాలతో మేధస్సుతో
అర్హతలకు ఆమడదూరాన అభ్యర్థులు మరో వైపు ....

మానవ వనరుల వనం భారత్
జాతికి బలమనలేము  మనం
పుణ్య భారతాన కరువైన "నై "పుణ్యం"
లెక్కకు మిక్కిలి కళాశాలలు
తామరతంపరగా విశ్వవిద్యాలయాలు
నిరుద్యోగ ఖార్ఖానాలు ..
నిజాయితీకి నిసిగ్గు "ఆలయాలు "....

డొల్ల చదువుల
ముల్లె కట్టుకు
ఇల్లు చేరే పట్టభద్రులు....
సొల్లు చదువుల
బిల్లు చూసి
గుండె జారే తల్లి దండ్రులు ....

చిత్తు కాగితాల్నెత్తినెత్తుకుని
ఏమిలాభం.. ఏమి లాభం..
ఉత్తీర్ణత నూరుశాతం.....
సంపూర్ణత ఇరవైశాతం.....??
చిగురిస్తున్న నిరుద్యోగం ....
బారులు తీరెను నిరాశావాదం ....
నిపుణత పాతాళానికి పయనం
కడుపు నింపని చదువులు ....
కాలు నిలువని బ్రతుకులు .....

గంపెడాశల పరుగు
చిరుద్యోగమైనా మెరుగు
మాయగాళ్ళ దందాలు
ఉద్యోగపు చందాలు
దాపురించిన దురవస్త
బాగవునా ఈ వ్యవస్త
జాతిపిత నిర్దేశ్యం
తొక్కిరి తుంగన
నిపుణుల
సృజనల
కదంబ భారతం
కలగానే మిగిలెనుగా
డిల్లీ నుండీ గల్లీ దాకా
మేడిపండు చదువులే ...!

విస్తరించగ లేరా?
సంస్కరించగ లేరా?
నిపుణత సృజనాత్మకతల
భరత జాతి పరువును
ప్రపంచ విపణిన నిలుపగా????

*****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
07/02/2016
సహస్రకవి101
కవిత సంఖ్య162
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం:సామాజికం
శీర్షిక:రాతి నేతలు

వీధులకెక్కిన వీధి రౌడీలా
జాతిని నడిపే రాతి నేతలా
చట్టాలను ధిక్కరించి
చుట్టాలతొ ఊరేగును
144 ఉన్నా వందలు గుంపులు కదలును
కళ్ళు నెత్తికెక్కినా
చూపు ఆకాశమెక్కినా
మరువకురా
నేలమీద నీ నడకని
బొక్కబోర్లపడతావని
ప్రజాస్వామ్య విలువ లేదు
ఖాకీలకు కళ్ళు లేవు
చట్టాన్ని మీరుతున్న
ముష్కరులను మూయలేరు
దొమ్మీలలొ కుమ్ముకున్నా
మూయలేరు ఖైదీలుగా
రక్షక బటులముందే
కక్షలతో కొట్టుకుంటే
దమ్ములంటు రెచ్చిపోయి
దుమ్ములేవ కొట్టుకుండ్రు

కొట్టినోళ్ళె తిట్టిన్రని
తిప్పి కేసు పెట్టుకుంద్రు
చట్టాల్ చేసే వాళ్ళకే
చట్టంలో తిరకాసులు
మెడకు తగులుకున్న
నల్లత్రాచులాయెనా?
సామాన్యుని
బతుకులోన
నిత్యం బ్లాకు మెయిలు
చట్టాలు..
తప్పుడు కేసుల చుట్టాలు..
ఇప్పుడైన
ఇంపుగా
అవగతమాయెనా?
   ****అవేరా****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
09/02/2016
సహస్రకవి 101
పద్య కవిత సంఖ్య:163
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
(డీసీ తండా ,వర్థన్నపేట లో
సోమవారం 8ఫిబ్రవరి2016 నాడు
గర్భవతిమహిళను వీధిన నగ్నంగాచేసి
వాతలు పెట్టిన దురదృష్ట ఘటనకు నా స్పందన)


శీర్శిక: పైశాచికం

నడి వీధిన పిశాచాలు
నాట్యమాడుతున్నాయి
మానవత్వ విలువలన్ని
మంట కలుస్తున్నాయి....

కళ్ళెదుటే అమానుషం
అడ్డుకోలేని సంస్కారం
నిష్క్రియాపర్వమున
నిద్దరోతున్నది
సమాజం నీడలోన
సభ్యత మరుగైనది......

దౌర్జన్యం
దాష్టీకం
చితిమంటన
మానవత
ఆడయని
బేలయని
దయను మరచి
రంకెవేసిన
పశుప్రవృత్తి
కలియుగ
దుశ్శాసన పర్వమిది ....
రాక్షస విన్యాసమిది......

ఆడపిల్ల
నగ్నత్వం
వీధులాటలాయెనే
విధివంచితకు
బ్రతుకు భారమాయెనే
సిగ్గుచచ్చి భానుడే
మబ్బుచాటు చేరడా.....

అర్థరాత్రి మాట
దేవుడెరుగు
పట్టపగలు
దిక్కులేదు
జాతిపితా!
నీవు కన్న కలలు
కల్లయేకద?
నీవేమాతో
వుంటే కన్నీరే
కడవనిండు!
మానవతా!
నీవెక్కడ??    
పాతాళం చేరావా
మూతలేని బోరు బావిలోన!
 *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
09/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:164
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రకృతి

శీర్షిక:ఖనిజసంపద

ఖనిజం..
నిజం..
ప్రకృతి ప్రసాదించిన వరం...
నాశనమే తప్ప
పునరుద్దరణ లేనిది
గనులు
ఖనిజాలు.....

ప్రకృతి సమతౌల్య సాధనాలు
మానవ అవసరాలకు
పచ్చని సౌధాలు
కరుగుతున్నవి
కొండలు గుట్టలు
మారుతున్నవి
కంకర గుట్టలు....

ఆవాసంగా
బతుకులీడుస్తున్న
పశువులు పక్షులు
కుందేళ్ళు నెమళ్ళు
సరీసృపాలు
నెలవు కరవై
మరుగై పోతున్నాయి.....
పచ్చదనం కరవైపోతున్నది...

గ్రామాల
బంచరాయిలు
నేలమట్టమై
రియల్ ఉచ్చున
ఉరిన చిక్కాయి
పచ్చిమేత
కరువై పశువులు
దిక్కుతోచక
పెంటకుప్పలుమేస్తున్నాయి
విషాహారం కడుపున చేరి
క్షీరము విషమౌతున్నది...
క్షీరవిషము త్రాగి
పసిపాపలు
తల్లడిల్లుతున్నారు
మూలనపడుతున్నది
మనుషుల ఆరోగ్యం......

నీరులేదు
నోరు తడవదు
గొంతులెండిన
పశువులు
వలసలు పోతున్నాయ్
పట్నాల కబేళాకు....

బావులలో నీరులేదు
బోరులలో నీరు రాదు
జలాశయాలెండిపోయె
భూగర్భాన
నీటిని దాచే ఖనిజం కుండ
ఇసుకను...
నదీ నదాలలో
విచ్చలవిడి
తవ్వకాలతో
పాతాళానికి జారెను
భూగర్బ జలవనరులు...

మిగిలెను నదులకు శోకం...
మనిషికదే శాపం.....

భరతమాత రత్నగర్భ
బొగ్గు గనులు
అగ్నిశిలలు
సున్నపు శిలలు
బెరైటీస్
బాక్సైటులు
పుట్టును లక్షల యేండ్లకు
గిట్టును అవినీతి దెబ్బకు...

"గాలి"వాటము అవినీతి...
ప్రభుత్వాల ధనదాహం..
విచ్చలవిడి తవ్వకాలు ....
లెక్కేలేని వన నాశనం...
తగ్గించక పోయినచో
తగ్గును పర్యావరణం
నిర్జించక పోయినచో
నిర్జనమవ్వును పుడమి...!

 *****అవేరా****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
10/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:165
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : పుట్టినరోజు
శీర్శిక: హాపీబర్త్ డే


పదవ నెల రెండున  పుట్టెను
మహాత్ముండొక్కడు
రెండవనెల పదిన పుట్టెను
పుణ్యాత్ముండొక్కడు
ప్రజలలో మమేకమౌతూ
విలేఖరిగా
విరులు జల్లుతూ
సమాజపు కుళ్ళును
కుళ్ళబొడుస్తూ
సహస్రకవులతో కలిసి
కవన సాగులో
ఏరువాక సాగిస్తూ
పాటల పల్లకిలో
తా వూరేగుతూ
అందరినీ ఊరేగిస్తూ
తలలో నాలుకలా
హైకులో
కలం నైఫ్ తిప్పుతూ
వాట్సప్ లో
గ్రూపులలో కలతిరుగుతూ
కలుపుకుంటూ
స్నేహామృతాన్ని పంచుతూ
హితుడై
స్నేహితుడై
పుడమిన
మసిలే
నిత్య పున్నమి చంద్రుడై
మా..మన..కళాచంద్రుడై
పుట్టిన రోజు శుభమౌ కదా!
పుట్టినరోజు శుభాకాంక్షలతో
........ఏవీ రావు....అ వే..రా

      *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
10/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:166(పాట)
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం :భక్తి
శీర్షిక: శ్రీ రామా

రామరామారామా
యనగా రమణీయ గానము కాదా
రామనామము తలచిన వేళా
చింతలన్నీ దూరము కావా

రఘువంశ తిలకా రామా
దశరథ నందన రామా.....రామ

హరుని విల్లును విరిచితివయ్యా
జానకి సతిగా బడసితివయ్యా......రామ

తండ్రి మాటకై కానల కేగీ
భాతృప్రేమకై లక్ష్మన జేరీ     ........రామ

భక్త వల్లభ జానకి రామా
హనుమః హృదయ విరాజిత రామా .....రామ

శతృభంజన లక్ష్మణ రామా
మిత్రుభంధువు సుగ్రీవ రామా......రామ

కుంబకర్ణుని దునిమిన రామా
రావణు నిర్జంచిన రామా.......రామ

భక్తితో నిను కొలవగ రామా
శాంతి నిండును మనమున రామా....రామా

      *****అవేరా*****

అయుత కవితా యజ్ఞం
12/02/2016
సహస్రకవి101
కవితసంఖ్య167
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం:ప్రకృతి

శీర్షిక: గోదారమ్మా కరుణించమ్మా

పారే నీరు లేదు
పేరుకు దక్షిణ గంగ
గంగలేని గంగ మన గోదారమ్మ
కరువైంది బాసరలో
గంగాస్నానం...
పుణ్యస్నానం..

వాగులెండెను
వంకలెండెను
కుంటలెండెను
చెరువులెండెను
నదీనదములు
మెండుగెండెను
జీవులన్నీ
గొంతులెండెను....

అడుగునమడుగులు తేలెను
బురదన పోచంపాడు
పొలాల ఎండిన బావులు బోర్లు
నదీమ తల్లికి బోర్లతూట్లు

పాతాళానికి
జారేను
భూగర్భ జలము
ఎండిన బావులలో
చచ్చిన చేపల కంపు...

త్రవ్విన బోరులలో
కరువైనవి నీటి జలలు
ఎండుతున్న పంటలు
బిక్కు బిక్కు మంటున్నవి
గొంతు తడపమంటున్నవి
వానచినుకు కోసం
బేలగా చూస్తున్నవి
ఆకాశం వైపు.....

నీరులేక మూగజీవులు
అలసి సొలసి
చూస్తున్నవి....
అరచి అరచి
చస్తున్నవి...

అడివిలోని
చెట్టుపుట్ట
ఆవురావురంటున్నవి
జింక
లేడి
అడవి దుప్పి
అడవిలోని
పులిరాజులు
నీటి బిక్షకోసమని
నీరములై రాలుచుండె....

అడగ లేదు నోరు
త్రాగ లేదు నీరు
ఇదీ మూగజీవాల తీరు....

నీరులేక పంటలెండె
అన్నదాత బతుకులెండె
పల్లెపల్లెబోరుమనగ
పసుపంతా పచ్చిరొట్ట
పసుపు రైతు బతుకెట్టా...?

తెల్ల బంగారము
తేలిపోయె నీరు లేక
పగడాల మిరపలన్ని
బీడయ్యెపాడయ్యె
మాగాణీపంటలేమొ
ఆటవిడుపులాడుకునే.....

ప్రకృతి కోపానికీ
ఎల్నినోల తాపానికి
ఎంతకష్టం ....ఎంత కష్టం
ఎంత నష్టం.....ఎంత నష్టం.!

మనుషుల
స్వయంకృత పాపానికి
గొంతెండిన గోదావరి ...
జీవానికి తపిస్తున్న
జీవనది గోదావరి...!!
     ****అవేరా****

అయుత కవితా యజ్ఞం
13/02/2016
సహస్రకవి101
కవితసంఖ్య168
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం:దేశభక్తి

శీర్షిక: భారతీయత

ఏదేశమేగినా
ఎందుకాలిడినా
పొగడరా నీతల్లి
భూమి భారతిని
అని నేర్పి రానాటి గురువులు

ముదిరిన వయసున
ముదిరిన మదమున
కానలేకున్నారా
నేటియువత?
మాతృదేశమన్న
భక్తి లేక
మదమెక్కి
విద్యాలయాల
మొత్తుకొనగ?

ఏ దేశ మేగకున్నా
నీ దేశముననే వుండి
కన్నతల్లి
మాతృదేశము
చనుబాలు త్రాగుచు
(గాలి నీరు,ఆహారము)
రొమ్ము గుద్దుచు
రొమ్ము చీల్చుచు
తులనాడ నీది
మానవ జన్మా??
పశుజన్మా??...

ఒకవైపు
నీలాంటి పాపులకు
ప్రాపుగ నిలుస్తూ
నిద్రాహారాలు లేక
సరిహద్దులో
మంచులో వణుకుతూ
మంచు తఫానులకూ
ముష్కర ఉగ్రవాదులతో
యుద్దాలలో మాతృదేశంకోసం
ప్రాణతర్పణ చేస్తున్న
భరత మాత ముద్దు బిడ్డలు
వారి త్యాగనిరతీ నీకు కనిపించట్లేదా??...

నీవు పుట్టిందే గడ్డమీద?
నిన్ను కన్న నీతల్లి తండ్రి
పుట్టిందే గడ్డ మీద?
నీవు శ్వాసించే
గాలి ఎక్కడిది?
నీవు త్రాగే నీరెక్కడిది?
నీవు తినే ఆహారం
ఈ పుణ్యభూమిన పండిన
బంగారు పంటకాదా?
ఈ వేదభూమిన పుట్టుక
జన్మజన్మల పుణ్యఫలం!

నీను కన్నందుకు
నీ కన్న తల్లికి
నీ మాతృభూమి
ఋణం ఎలా తీర్చగలవు?

రాజ్యాంగ ధిక్కారం
విదేశీయుల మూర్ఖపు
వాదనలను
ఎదిరించి
వాదించి
గెలవలేని
నీకు..
ఎదురు మాట్లాడ
హక్కెక్కడిది?
ఈ పుణ్య భూమిలో
స్థానమేల??
స్థాణువుని చేరి
మా భారత మాతకు
భారము తగ్గించు...!

ప్రజాస్వామ్యమున్నది
దేశద్రోహులను ప్రోత్సహించుటకు కాదను
నిజము నేతలు గ్రహించి
మసలిన చాలును
అధికారము కొరకు
నీతితప్పి
నోరు జారిన
జాతి ...మరువక
నీకు బుద్దిచెప్పు..!
  ****అవేరా****

అయుత కవితాయజ్ఞం
17/02/2016
సహస్రకవి101
కవిత సంఖ్య169
కవి:అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం:మేడారం జాతర
శీర్షిక: మహా జాతర

జన జీవన
పట్టుకొమ్మ
జానపదము
మేడారం...

జీవన
జాతర సంస్కృతిలో
కొండల
కోనల
అడవుల మధ్యన
ప్రకృతిఒడిలో
వెలుగుతున్న కుగ్రామం
మహా జాతరకు వేదికైంది
తెలంగాణ
కుంభమేళా
ఈ నాడే సురువైందీ...

పల్లె పల్లె కదిలింది
పట్నాలూ కదిలాయి
తెరలు తెరలుగా
అలలు అలలుగా
కదులుతున్న జనవాహిని
బండెనక బండి
కారెనక కారు
బస్సెనక బస్సు
బారులు తీరెను
మేడారం వైపు...

నాలుగురోజుల పండుగ
మేడారం జాతర...
శతాబ్దాల చరిత ఘనత
వనబిడ్డల పోరాటఘనచరిత
అమరులైన
అమర వీరులు
మేడరాజు
పగిడిగిద్దరాజు
గోవిందరాజు
జంపన్నలు
వీరవనితలు
నాగులమ్మ
సారలమ్మ
సారక్కలు

మేడారం జాతర...
వనదేవతలే
నిజ దేవతలై
వెలుగొందే జాతర....

తొలి రోజు సారలమ్మ
మలి రోజు సమ్మక్క
గద్దెలెక్క నుండగా
మరునాడు మహాజనం
దర్శనాలు నిండుగా
వెల్లువలా కదలగా....

జంపన్న వాగైన
సంపెంగ వాగున
పుణ్యస్నానాల
పరవశాన భక్తులు
కోరిన కోరికలే
నెరవేరగ నిండుగా
నిలువెత్తున బంగారం
నైవేద్యాలివ్వగా.....
ధన్యమయ్యె
జన్మంటూ
భక్తకోటి ధన్యతనే పొందగా
ప్రకృతి ఆరాధనకే
ప్రతిరూపం
ఈజాతర
సంప్రదాయ
ఆచారం
కలగలిసినజాతర
నాల్గునాళ్ళ పండగ
ముగియునుగా
నిండుగా
వన దేవతల
వన ప్రవేశ మొందగా!
వనములన్న దేవతలని
సందేశము నివ్వగా...!!
   *****అ వే రా *****
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం

22/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:170
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: జయం-అపజయం

మానవ జీవన
చదరంగంలో
పావుల కదలికలే
నీ ప్రణాళిలు
జయాపజయాలనేవి
అనుభవాలే కానీ
దైవాధీనాలెన్నటికి కావు
నీ ప్రయత్న లోపం
నీ అపజయం....
నీ  కార్య నిబద్ధతే
నీ విజయం.....

ఒకవిజయానికి
పొంగిపోతే
తదుపరి పోరులో
అపజయమే ....

అపజయానికి
కుంగిపోయినా
తదుపరిపోరులో
అపజయమే....

పొంగుట
క్రుంగుట
మానసిక
రుగ్మత

మానవ జీవితాన
లక్ష్యాలనేకం
ముగింపులేని
నిరంతర ప్రక్రియ.....

లక్ష్యాలు
ఒక్కోలక్ష్యం
ఒక్కో మెట్టు
మెట్టు మెట్టున
విజయం
తదుపరి లక్ష్యానికి
ప్రస్థానం........

ఈ లక్ష్య సాధనలో
అడ్డుగోడలు
అగాధాలు
ఎదురైనా
కఠోర సాధన
అపార నమ్మకం
ఆత్మవిశ్వాసం
విజయం వైపు
నడిపిస్తుంది.....

జయమైనా
విజయమైనా
ఒక ఫలితమే
తప్ప శాసనం
కాదని తెలుసుకో
ఈ నాటి అపజయాన్ని
రేపటి విజయంగా మలచుకో
ఎవరెన్ని విజయాలు
సాధించినా
మూలాలు వారి
అపజయాల్లో వుంటాయి
ధామస్ ఆల్వా ఎడిసన్
వేల పరాజయ
పరంపరలనుండే
విజయం సాధించాడు.......

పరీక్షల్లో ....
తొలిసారి విఫలమై
మలిసారి సఫలమైన
విద్యార్థులెందరో...

పరాజయ దారులు
శోధించిన వారికి
విజయమార్గం
గోచరిస్తుంది.......

కార్యోన్ముఖ
మానసిక శక్తి
ప్రణాళిక
నిబద్దత
ఆత్మవిశ్వాసం
కృషి
కార్య శూరుడిని చేస్తాయి
నిన్ను విజయ తీరాలకు
చేరుస్తాయి....

జయాపజయాలు
చర్యలకు ప్రతిచర్యలకు
ప్రతిరూపాలు
అపజయాలతో
జీవితాలాగవు
కృంగిన మనసున
ఆత్మహత్యలలో
సంపూర్ణ అపజయమే తప్ప
విజయాలుండవు
ఆశావాదివై
తదుపరి
దారినున్న
విజయాలను
వీక్షించు
ఆత్మవిశ్వాసంతో
ముందుకు దూకాలి.......

ప్రతివిజయానికి
ఒదిగే వాడే
పరంపరగ విజయాలు
సాధిస్తాడు.......

ప్రతీ జీవితానికి
తుఫాను తాకిడి కావాలి
ప్రచండగాలికి
మనిషిలో కాలుష్యం
వదిలిపోయి
శుభ్రపడుతుందిమనసు
తుఫాను అనంతరం
భయాందోళనలు
చెల్లాచెదురై
ప్రశాంతత చేకూరి
లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది...

ఆటలో
ఒక భాగము ఓటమి
ఒక భాగము విజయం
ఈ జీవిత ఆటలో
ఏ భాగమైనా స్వంతం కావచ్చు
ధర్మ పోరాటలన్నీ
ఓటమితో మొదలై
విజయంతో ముగిసాయి
ఆ విజయాలే
స్పూర్తిగా ముందుకు దూకాలి....

కఠోర పరిశ్రమ
విజయ మార్గాన్వేషణ
విజయానికి సోపానాలు...

****అవేరా***
అయుత కవితా యజ్ఞం
22/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:171
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: నడక

బుడిబుడి నడకలు నేర్చావు
తల్లీ తండ్రి చేతి వేళ్ళు పట్టుకుని
నాల్గు కాళ్ళ నడక
రెండుకాళ్ళ నడకైంది....

నడక కందని
దూరాన విద్యాలయాలు
స్కూలు బస్సులతో
ఆటోలతో
కరువైంది నడక
ఆటస్థలాలు లేని బడి
ఆటలే లేని చదువులు....

నడక లేని విద్యార్థి
పరుగు రాని విద్యార్థి
ఆటలు లేని చదువులు
తరగతిలో పడక గదులు
చదువుల తల్లికి
నిద్రాదేవికి పోటీ
ఆటలేనిదే చదువురాదు....

చదువుకు ఆటే
ఉత్ప్రేరకము
వ్యాయాయము లేక
ఆరోగ్యం లేదు
ఆరోగ్యం లేక
చదువు రాదు.....

పాఠశాలలో లేకున్న
రెండు సంధ్యల నడక
మేలుజేయు
చిన్నలకైనా పెద్దలకైనా
నడక నడిపిస్తుంది
ఆరోగ్యపు గ్రాఫ్...

అడుగు ముందుకు
ఆరోగ్యం ముందుకు
అడుగు కదలక
అనారోగ్యం వెనుకకు
రోడ్డైనా సరే
పార్క్ అయినా సరే
నడక సాగాలి ముందుకు
మహాభాగ్యమే నీ ముంగిట ....

సాఫ్ట్ వేర్ జాబు లంట
ఇంట్లో కాసుల పంట
నడకలేక సీటుకి సీలు...
నడుము నొప్పితో బేజారు
కారు ఎక్కి
కారు దిగును
నడకంటే బద్దకము
నడక లేక రోగము
వొంటిని చేరు...

పెద్ద తలకాయలనే
సాఫ్ట్ కంపెనీలకు తెలియదా
నడకే నజరానాయనీ ...

పార్కింగును
అర కిమీ దూరాన
పెట్టి చూడు
ఉద్యోగుల ఉత్సాహం...

అరోగ్యమె భాగ్యమని
ఆనందమె జీవితమని
ఆలోచన రాదేమీ
అందలమెక్కించే
ఆరోగ్యపు ఆలంబన
అచ్చోసిన కాలి నడక.....

****అవేరా***


అయుత కవితా యజ్ఞం
24/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:172
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: హైదరాబాద్ నీటి గండం

హైదరాబాద్
మహానగరం
విశ్వనగరం
కలలు కనుసన్నలలో
కదిలే ప్రగతికి
ప్రతిబంధకమేమా
అని అనుమానం
నీటివెతల బతుకుల కొలమానం ...

రానున్నది ఎండాకాలం
దాహంతో గొంతులెండేకాలం
ముసుగు తన్నెను వర్షాకాలం
ముఖం చాటేసెను
నైఋతి ఋతుపవనం
నీరు  లేక కన్నీటి సాగరాన
నీటి సాగరాలు
గండిపేట
హిమాయత్ సాగరాలు.....

అడుగంటి
బురదన
స్నానమాడుతున్నాయి
ఆనాడు
కళ కళ లాడిన
గండిపేట
జలాశయం
ఈనాడు
దాహంతో
విలవిలలాడింది
కళా విహీనంగా మారింది
పర్యాటక కేంద్రం కల
కలకల మాయెను
పర్యాటక ప్రేమికుల
ముఖారవిందాలు
ఆందోళనలో
కలవర మాయెను

నీటన జలపుష్పాల
స్థానాన
గుండు రాళ్ళు
దర్శనమాయెను

దశాబ్దాలు దశాబ్దాలు
దశదిశలా
నిండుకుండలై
గొంతులు తడిపాయి
నగరవాసులకు
ఉద్యాన వనాన
తరులూ లతలూ
దాహార్తిని తీర్చుకున్నాయి...

ఈ ఏటి నీటి
కటకట
వేసవిలో
చిటపట
పట్నం బతుకుల ఇక్కట...

నీరు లేక
బతుకు లేక
పట్నం పల్లెకు పోతుందా...?????

****అవేరా***

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
24/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:173
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: కటికి జలపాతం

జలపాతం...
జలజల పారే
అందాల వడ్డింపు
వెండి కరిగి
వరదై
పారుతూ వెలిగే
అందాల
విందుకు
విస్తరైంది కొండ....

కొండల జారు
జలపాతాలు ...
ప్రకృతి దేవత
నీలాల కురులను
వయ్యారపు హొయలతో
ఆరబోసుకుంటున్నట్టు
వీనుల విందగు అందం
కన్నుల పండుగ చేస్తుంది

వందల అడుగుల
ఎత్తున దూకే
గంగమ్మ
కొండలను
ముద్దాడుతూ
కోనలలో
పరుగులెడుతూ
చిలికే
మంచుతెరలు
వంటిని తాకిన
జివ్వున పులకించేను
మేను....

కొండలపై
రాతి బండలపై
గంగ అద్దిన
నీటిసిరులను
భానుని కిరణాలు
ముద్దాడినవి...
సూర్యకిరణాల
వెలుగులో
నల్లని కొండలు
పచ్చతివాచీల నడుమ
వెండి తొడుగులు
తొడుక్కున్నాయి
అందాల విశాఖ మన్యంలో
అనంతగిరి మండలాన
విరిసిన ప్రకృతి చూచి
మదిలో....
కురిసిన పరవశమిది...

****అవేరా***

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
24/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:174
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: వృద్ధాశ్రమాలు

"జీవన పోరాటాన
అలసి సొలసి
ఒడలు వాడి
ముడతలు పడి
జీవిత చరమాంకానికి
చేరావా!
నీవు నీ జీవన పరమావధిగా
సేవ చేసిన వృత్తి
నీ సేవలు చాలంది
నామ మాత్రపు
పింఛను ఇచ్చి "మమ"అంది....

నీ భుజాలపై మోసి
నడకలు నేర్పించి
చదువు సంధ్యలు
చెప్పించి
వివాహహాలు చేసి
ఇంటి వాళ్ళను చేసిన
పిల్లలు
పెద్దలై
పెద్దల భాద్యత మోయుటకు
వంతు లేసుకుంటుంటే
సిగ్గున చచ్చి
వృద్ధాశ్రయం చేరావా!
నీలా వాళ్ళూ
రేపటి వృద్దులమని
తెలియలేకున్నారు!"

వృద్దుల ఆరోగ్యరక్షణ
సామాజిక భద్రత
సౌకర్యాల కల్పనలో
ప్రభుత్వం శీతకన్ను మానాలి
ఉపాధి లేని
వృద్ధుల సంరక్షణ కేంద్రాలు
ఏర్పాటుచెయ్యాలి.....

వృద్దాప్యలో
చుట్టుముట్టును
ఆర్థిక
ఆరోగ్య
మానసిక
సమస్యలు

సొంతమనుషుల
నిర్లక్ష్యం
వేధింపులు
ఒంటరితనం
విసుగు
ఆత్మాభిమానభంగంతో
ఆత్మన్యూనతాభావంలో
కష్టాల కడలిలో
మునగ లేక తేల లేక
ఈదలేక ఈదుతున్నారు....

ఉమ్మడి కుటుంబాలు
ముక్కచెక్కలైనాయి
వృద్ధుల బాద్యతలు
అయినవాళ్ళకు
గుదిబండలయ్యాయి
పెరిగిన ధరలు...
ఆకాశంవైపు
చూస్తున్న జీవనవ్యయం....
మరో మనిషి బరువంటే
బతుకుకు భారమే..

కానీ భాధ్యతలు
మరచిన సంతానం
బరువుబాధ్యతలు మోసి
శిధిల యంత్రాలైన
వృద్ధుల పోషణ నిర్లక్ష్యం చేస్తున్నారు
కొందరు వృద్ధాశ్రమ
వృక్షాలకింద చేర్చి
చేతులు దులుపుకుంటున్నారు.....

మరికొందరు మానవత్వం
మరచి ఇంటినుంచి
గెంటి వేస్తున్నారు......

మరికొందరు
ఇంటిచాకిరీ చేయించి
పనివాళ్ళుగా
చూూస్తున్నారు......

మరికొందరు
బిడ్డల ఆదరణ కొరవడి
బిక్షాటన చేస్తున్నారు......

ఇదేగతి రేపు
తమకీ పట్టవచ్చన్న
ధ్యాసలేదు వారి సంతానానికి ....

లోపభూయిష్ట
ప్రభుత్వ
పింఛను పథకాలు
అధిక ప్రిమియమ్ లు
బ్యాంకు ఖాతా లేమి....
సురక్షభీమా
జీవనజ్యోతి
అటల్ పెన్షన్ పథకాలను
నిర్వీర్యం చేశాయి
ప్రభుత్యోగులకు మాత్రమే కాదు
దేశ పౌరులందరికీ
సార్వజనీన పింఛనుపథకం
అమలు చెయ్యాలి
వృద్ధులకు
ఉచిత భోజన పథకం ఉండాలి.....

మానసికభరోసా
వయోధికులకు ఆసరా
ఒంటరితనంకు ఆత్మన్యూనత తోడు
అందుకే తన వయసు వారితో
జీవిస్తే ఉత్తేజం తోడవుతుంది
స్వచ్చంద సంస్థలు
దాతృత్వ సంస్థలు
ప్రైవేటు సంస్థలు
ప్రభుత్వాలు
వృద్ధులకు ఆసరాగా నిలవాలి
వారులేనిదే
మేమూలేముగా
అని వారిసంతానం
గుర్తెరగాలి
లేకపోతే....
వారికీ ఇదేగతి.

*****అవేరా*****


అయుత కవితా యజ్ఞం
25/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:175
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం

**శీర్శిక: నీటి బొట్టు**

నల్ల మబ్బురాల్చిన
వాన చినుకును నేను
నా గమ్యం నాకే తెలియదు
నింగినుండి భూమికి పయనం
గాలివాటు ప్రయాణం
నా గమ్యమే
నాకు విలువ నాపాదిస్తుంది
నీ చేతిలో పడితే
నీ దాహం తీర్చే బిందువౌతాను
మురుగు కాల్వన పడితే
మలినమైపోతాను
కాలే పెనం మీద పడితే
ఆవిరై గాలిన కలిసిపోతాను
అడవిలో పడితే
వృక్షమాతకు ఆయువౌతాను
కొండపై పడితే
జారి జారి
పరుగున వాగును చేరుతా
చెరువున పడితే
చేపకు జీవనమౌతా
రైతన్నకు పండుగనౌతా
తామరాకు పై పడితే
ముత్యపు కాంతిలో వెలిగి పోతా
ఆలిచిప్పలో పడితే
ముత్యమై
జాతిరత్నమౌతాను...!!

****అవేరా****

2 comments:

  1. 🌺

    బుధవర్గమందుండు బూరివర్గమునుండు
    బురవర్గమేల గోపురమునుండు
    ప్రజాపనులనుండు ప్రైవేటుపనులుండు
    పేపరొక్కటిదొరుక పేరునుండు
    ఉత్తముడుగవుండు ఉత్తమూడుగవుండు
    చెత్త గూడ కవన కత్తి జేయు
    బుణ్యులందుండును బుడ్బుంగలందుండు
    ఎందువెదికినయందు ఏవిరావే !

    ఎందెందువెదికినా యందు ఏవిరావే
    మనమేదియిచ్చినా మరిమళ్ళిరావే !
    వేకువన్పూవులేవేల వెట్టునాట
    చల్లగానువిను కళా చంద్రమాట !!

    🌺|🇮🇳
    ✏@ కళాచందర్
    జర్నలిస్ట్.
    ( SK 387 )

    🌺🌺🌺✅🙏💐✅🌺🌺🌺

    ReplyDelete
  2. 🌺

    బుధవర్గమందుండు బూరివర్గమునుండు
    బురవర్గమేల గోపురమునుండు
    ప్రజాపనులనుండు ప్రైవేటుపనులుండు
    పేపరొక్కటిదొరుక పేరునుండు
    ఉత్తముడుగవుండు ఉత్తమూడుగవుండు
    చెత్త గూడ కవన కత్తి జేయు
    బుణ్యులందుండును బుడ్బుంగలందుండు
    ఎందువెదికినయందు ఏవిరావే !

    ఎందెందువెదికినా యందు ఏవిరావే
    మనమేదియిచ్చినా మరిమళ్ళిరావే !
    వేకువన్పూవులేవేల వెట్టునాట
    చల్లగానువిను కళా చంద్రమాట !!

    🌺|🇮🇳
    ✏@ కళాచందర్
    జర్నలిస్ట్.
    ( SK 387 )

    🌺🌺🌺✅🙏💐✅🌺🌺🌺

    ReplyDelete